Sai Pallavi Marriage: త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సాయి పల్లవి? ఇందులో నిజమెంత?
Sai Pallavi Marriage: తమ నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన నటి సాయిపల్లవి. శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత ఈ బ్యూటీ ఏ ప్రాజెక్టు ఒప్పుకోలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Sai Pallavi Marriage Rumors: టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో సాయిపల్లవి (Sai Pallavi) ఒకరు. గ్లామర్, ఎక్స్‌పోజింగ్ పాత్రలకు దూరంగా ఉంటూ.. కంటెంట్ ఉన్న కథల్లో నటిస్తూ వస్తుంది ఈ అమ్మడు. ఫిదా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. తెలుగు ప్రేక్షకులు హైబ్రిడ్ పిల్లగా పిలుచునే ఈ అమ్మడు కొంతకాలంగా సినిమాలను ఒప్పుకోట్లేదు. చివరగా 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో నటించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని.. బాక్సీఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత సాయిపల్లవి ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. కనీసం ఎలాంటి ఫంక్షన్ లోనూ కూడా కనిపించట్లేదు.
దీంతో తను త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందనే (Sai Pallavi Marriage) వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని సాయిపల్లవి సన్నిహతులు క్లారిటీ ఇచ్చారు. సాయిపల్లవి మంచి పాత్ర కోసం వెయిట్ చేస్తుందట. అందుకే ఏది పడితే అది ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది. ఈ విషయాలపై సాయిపల్లవి స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో రానా హీరోగా నటించిన 'విరాటపర్వం' (Virataparvam) చిత్రం మాత్రమే ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా.. రిలీజ్ మాత్రం వాయిదా పడుతూ వస్తుంది.
Also Read: Tamannaah Bhatia: హీరోయిన్ తమన్నా వేసుకున్న డ్రెస్ ఖరీదు.. అక్షరాల అన్ని లక్షలా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook