Trisha Tweet: దాదాపు 20 సంవత్సరాల నుంచి సౌత్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ త్రిష. ఇప్పటికి కూడా తెలుగు తమిళ ప్రేక్షకులలో త్రిషకి అభిమానం తగ్గలేదు. ఇందులో భాగంగా ప్రస్తుతం కూడా స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ ఛాన్స్ అందుకుంటూ దూసుకుపోతోంది త్రిష. ఈ మధ్యనే మణిరత్నం పోన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించిన ఈమె …తాను ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన విజయ్ తో హీరోయిన్గా చేస్తూ లియో అనే సినిమాతో ఈ మధ్య మన ముందుకు వచ్చింది. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కాగా ఈ సినిమాలో తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీ ఖాన్ కూడా హీరో ఫ్రెండ్ గా ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్పే నటుడుగా కనిపించాడు. కాగా ఇప్పుడు ఈయన త్రిష గురించి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఈమధ్య తమన్న కావాలయ్యా సాంగ్ తో విమర్శలు అందుకున్న ఈయన ఇప్పుడు మరోసారి త్రిష గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. లియోలో తాను నటిస్తున్నాను అని తెలిసినప్పుడు.. త్రిషతో రేప్ సీన్ వస్తుందని ఆశపడ్డాడట.. ఆమెను తన చేతుల్తో ఎత్తుకుని బెడ్ రూమ్ లో వేసే సీన్ ఉంటుందని అనుకున్నాడట. ఈ నటుడు ఇలా త్రిష మీద అభ్యంతరకంగా మాట్లాడిన మాటలు కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. దీనిపై ఎంతోమంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి వాడితో ఇంకెప్పుడూ నా జీవితంలో నటించను అని త్రిష ఖరాఖండిగా చెప్పేసింది. 


త్రిష ఈ విషయంపై స్పందిస్తూ..ట్వీట్‌లో రాస్తూ.. 'మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరంగా అనిపిస్తోంది. అతని లాంటి నీచమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్‌ను ఇకపై ఎప్పుడూ పంచుకోను. నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా ఇలా జరగకుండా చూసుకుంటాను. అతని లాంటి వారి వల్ల మానవాళికే చెడ్డపేరు వస్తుంది.’ అని రాసుకొచ్చింది.




 


మరోపక్క ఈ విషయంపై తమిళ ఇండస్ట్రీ మొత్తం తమ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లియో దర్శకుడు లోకేష్ కనగరాజు కూడా దీనిపైన స్పందించారు. లోకేశ్ తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ.. "మేమంతా ఒకే టీమ్‌లో పనిచేశాం. మన్సూర్ అలీ ఖాన్ చేసిన స్త్రీల పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చూస్తే చాలా కోపంగా ఉంది. ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళలు, తోటి నటీనటులను మనం గౌరవించాలి. ఏ పరిశ్రమలోనైనా ఇలాగే ఉండాలి.' అని పోస్ట్ చేశారు.


 



ఇక హీరోయిన్ మాళవిక స్పందిస్తూ.. చాలా నీచనంగా, అసహ్యంగా అనిపిస్తోంది.. మహిళల ఇలా గురించి మాట్లాడటం సిగ్గు చేటు.. .. ఇలాంటి సాహసం ఎలా చేయగలిగాడు.. తరువాత జరిగే పరిణామాల గురించి ఆలోచించలేదా? ఇతడ్ని చూస్తే సిగ్గేస్తోంది.. అంటూ ట్వీట్ వేసింది.


మరోపక్క ఇలాంటి విషయాల పైన తప్పకుండా స్పందించే చిన్మయి శ్రీపాద ఒక పెద్ద పోస్ట్ వేసింది. ఇలాంటి మనుషులు ఎప్పుడూ ఇలానే మాట్లాడుతుంటారు. అధికారం..డబ్బు చూసుకునే ఇలా నీచంగా మాట్లాడుతుంటారు.. ఇది సర్వసాధారణమే అని చెప్పుకొచ్చింది. 




 


మొత్తం మీద త్రిష పైన మన్సూర్ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.


Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే


Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook