వేధింపులు తాళలేక నటి ఆత్మహత్యాయత్నం!
టాలీవుడ్‌లోనూ సినిమాలు చేసిన నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం (Vijayalakshmi Attempts Suicide) చేసింది. వేధింపులు తాళలేక తాను ఈ నిర్ణయం తీసుకున్నానంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది.
వేధింపులు తాళలేక దక్షిణాది సినీనటి విజయలక్ష్మి ఆదివారం ఆత్మహత్యాయత్నం (Vijayalakshmi attempts suicide) చేసింది. వెంటనే ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఓ రాజకీయ నేత తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం ప్రకంపనలు రేపుతోంది. Nithin Wedding Photos: హీరో నితిన్, షాలినిల పెళ్లి వేడుక ఫొటోలు
నటి విజయలక్ష్మి (Actress Vijayalakshmi) తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ మూవీలో నటించింది. తమిళ, కన్నడ సినిమాల్లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా సినిమా చేసింది. ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. సోషల్ మీడియాలో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు కామెంట్లు చేసింది. నామ్ తమిళార్ కట్చి పార్టీ అధ్యక్షుడు సీమన్, పనగకట్టు పడాయ్ కట్చి పార్టీకి చెందిన నేత హరి నాడార్ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. బతకాలని లేదు, చచ్చిపోతానంటూ నటి పోస్ట్.. ఆపై!
‘ఇదే నా చివరి వీడియో. గత కొన్ని నెలలుగా రాజకీయ నాయకుడు సీమన్, ఆయన పార్టీకి చెందిన ఓ వ్యక్తి వల్ల నాలుగు నెలలుగా సమస్యలు ఎదుర్కొంటున్నాను. మీడియాలో సైతం హరి నాడార్ నాపై దారునమైన వ్యాఖ్యలు చేశారు. నేను కర్ణాటకలో పుట్టడమే దీనంతటికి కారణం. అందుకే సీమన్ నన్ను ఎంతగానో వేధించాడు. ఇక వేధింపులు భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నానంటూ’ బీపీ ట్యాబ్లెట్లు మింగి నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్