Adipurush 1st Day Collections: ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తొలి రోజు మిక్సడ్ టాక్ వచ్చినా భారీ ఓపెనింగ్స్ సాధించింది. అయితే శని, ఆదివారాల్లో కలెక్షన్లు జోరు సౌత్ లో కాస్తా తగ్గే అవకాశం ఉంది. అయితే ఆదివారం వరకు హిందీలో అడ్వాన్సడ్ బుకింగ్స్ అయిపోయాయి. అయితే తొలి రోజే సినిమాపై రకరకాల విమర్శలు వచ్చాయి. సినిమా బాగుందని కొందరు.. అస్సలు బాగోలేదని మరికొందరు.. స్టోరీ కంటే గ్రాఫ్రిక్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఇంకొందరు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో బాహుబలి 2, RRR మరియు KGF 2 తర్వాత తొలి రోజు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆదిపురుష్ రికార్డు సృష్టించింది. దేశ ముత్తం మీద ముదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.88 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ కలెక్షన్లు సమాచారం ఇంకా రాలేదు. అయితే ఓవర్సీస్ వసూళ్లు దాదాపు $3 మిలియన్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని కలుపుకుంటే తొలిరోజు ఆదిపురుష్ రూ. 115 కోట్లు సాధించినట్లే. విమర్శలు, వివాదాల మధ్య ఆదిపురుష్ భారీగానే కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Also Read: Adipurush Full HD Print Leaked: ఆదిపురుష్ ఫుల్ హెచ్‌డి ప్రింట్ లీక్.. ఇంటర్నెట్లో ఫుల్ మూవీ


ఫస్ట్ డే కలెక్షన్స్ లిస్ట్


నైజాం - రూ.18 కోట్లు (రూ. 11.50 కోట్ల షేర్)


సీడెడ్ - రూ. 5 కోట్లు (రూ. 3.75 కోట్ల షేర్)


ఆంధ్ర - రూ. 16.50 కోట్లు (రూ. 13.25 కోట్ల షేర్)


AP/TS - రూ. 39.50 కోట్లు (రూ. 28.50 కోట్ల షేర్)


కర్ణాటక - రూ. 6.50 కోట్లు (రూ. 3.50 కోట్ల షేర్)


తమిళనాడు/కేరళ - రూ. 2 కోట్లు (రూ. 0.75 కోట్ల షేర్)


రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 40.50 కోట్లు (రూ. 17.50 కోట్ల షేర్)


మొత్తం - రూ. 88.50 కోట్లు (రూ. 50.25 కోట్ల షేర్).


Also read: Adipurush OTT Streaming: ‘'ఆదిపురుష్‌'’ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి