టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ఫేమ్ ప్రభాస్ (Prabhas) బాలీవుడ్‌లో తన తొలి ప్రాజెక్టును ఇటీవల ప్రకటించాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ మూవీ చేస్తున్నట్లు తెలిపి తన అభిమానులను సర్‌ప్రైజ్ చేయడం తెలిసిందే. రాముడి పాత్రలో ప్రభాస్ సూపర్‌గా సెట్ అవుతాడంటూ ఫ్యాన్స్  హ్యాపీగా ఉన్నారు. ఆది పురుష్ సినిమాకు ప్రభాస్‌ను ఎందుకు ఎంపిక చేశాడు, ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని విషయాలు దర్శకుడు ఓం రౌత్ షేర్ (Adipurush Director Om Raut) చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఇవి హాట్ టాపిక్ అవుతున్నాయి. Fact Check: ఎస్పీ బాలుకి కరోనా నెగటివ్.. అసలు విషయం ఇది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ఈ సినిమాకు ప్రభాస్ మాత్రమే సరిపోతాడని భావించాను. ఒకవేళ ప్రభాస్ ఆది పురుష్ చేయకపోతే సినిమానే చేసేవాడిని కాదు. ప్రభాస్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతడు నిలబడే తీరు, నడిచే స్టైల్, ప్రవర్తన అన్నీ నాకు బాగా నచ్చాయి. దీంతో ప్రభాస్‌తో సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ సినిమా విషయాలు ఇప్పుడే చెప్పడం సరికాదని’ ఆది పురుష్ దర్శకుడు ఓం రౌత్ అభిప్రాయపడ్డారు. Sai Dharam Tej: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్!


మా టీమ్ చాలా శ్రమించి, పని చేసి రామకథను ప్రాజెక్టు కోసం సిద్ధం చేసిందని తెలిపారు. వాస్తవానికి తానాజీ కన్నా ముందు ఆది పురుష్ సినిమా చేయాలనిపించిందని, అయితే పూర్తి స్థాయిలో కథ, చరిత్ర, పరిశోధన చేయాల్సి ఉంటుందని వాయిదా వేసుకేన్నట్లు చెప్పారు. సేకరించిన వివరాలను డ్రాఫ్ట్ సిద్ధం చేసి, దాన్ని రెండు నెలలు శ్రమించి ఓ కొలిక్కి తీసుకొచ్చామని ఆది పురుష్ కోసం తీసుకున్న జాగ్రత్తలు, వర్క్ వివరాలు ఓం రౌత్ షేర్ చేసుకున్నారు. Deepthi Sunaina Photos: శారీలో దీప్తి సునైనా సిగ్గు, హొయలు


లాక్‌డౌన్ తర్వాత ప్రభాస్‌ను కలిసి కథ చెబితే ఓకే చెప్పాడన్నారు. అప్పటికాలంలో ఉన్నట్లుగా చూపించేందుకు స్క్రీన్ ప్లేతో పాటు సెట్ ఏర్పాట్ల కోసం శ్రమించాల్సి వస్తుందన్నారు. 2021లో షూటింగ్ చేసి 2022లో విడుదలకు సిద్ధం చేస్తామని నిర్మాతలు తెలిపారు. మరోవైపు ప్రభాస్ రాధేశ్యామ్, ఆ తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉందని తెలిసిందే. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే ఆది పురుష్ ప్రాజెక్టు మొదలుకానుంది. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా! 
 Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి