Sai Dharam Tej: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్!

#SoloBrathukeSoBetter  ‘ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి...’ అని, సారీ ప్రభాస్ అన్న అంటూ మెగా మేనల్లుడు, టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej) చేసిన పోస్ట్ నిన్నటి నుంచి హాట్ టాపిక్‌గా మారింది.

Last Updated : Aug 24, 2020, 02:00 PM IST
  • సారీ ప్రభాస్ అన్న అంటూ వీడియో పోస్ట్
  • సాయి ధరమ్ తేజ్ పెళ్లికి రెడీ అని ప్రచారం
  • తీరా చూస్తే సినిమా ప్రమోషన్ చేసుకున్న తేజ్
  • సోలో బ్రతుకే సో బెటర్ అంటూ లవ్‌లో పడ్డాడు
Sai Dharam Tej: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్!

‘ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి...’ అని, సారీ ప్రభాస్ అన్న అంటూ మెగా మేనల్లుడు, టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej) చేసిన పోస్ట్ నిన్నటి నుంచి హాట్ టాపిక్‌గా మారింది. సాయి ధరమ్ తేజ్ సైతం పెళ్లికి రెడీ అవుతున్నాడేమోనని, నిహారిక వివాహం తర్వాత మెగాస్టార్ ఇంట్లో మరో వేడుక అంటూ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. తీరా చూస్తే అదంతా సినిమా ప్రమోషన్ అని తెలిసి అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. Diabetes Prevention: షుగర్ పేషెంట్స్ అలా నడిస్తేనే ప్రయోజనం

నిఖిల్ పెళ్లయిపోయింది, తర్వాత నితిన్, రానా.. ఇప్పుడు నా వంతు వచ్చింది.. బ్యాచిలర్స్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అవుతున్నానని సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేసి మంచి హైప్ క్రియేట్ చేశాడు. ‘అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకే సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్‌కి అమృత ని చూసాక ఏమైంది ???’ అంటూ సోలో బ్రతుకే సో బెటర్ (#SoloBrathukeSoBetter) మూవీ అప్‌డేట్ అందిస్తూ ట్వీట్ చేశాడు. Deepthi Sunaina Photos: శారీలో దీప్తి సునైనా సిగ్గు, హొయలు

సోలో బ్రతుకే సో బెటర్ (Solo Brathuke So Better) మూవీ నుంచి ‘హే.. ఇది నేనేనా’ సాంగ్‌ను ఆగష్టు 26వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు సాయి ధరమ్ తేజ్ ప్రకటించాడు. ఇది చెప్పడానికే ప్రభాస్‌కి సారీ చెప్పి మరీ ఈ సీక్రెట్ చెప్పేసరికి ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై మూవీ రూపొందుతోంది. సాయి ధరమ్ తేజ్‌తో నభా నటేష్ జోడీ కట్టింది. లాక్‌డౌన్ వల్ల సినిమా విడుదల వాయిదాపడింది. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా! 
 Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి

Trending News