SP Balu Health Updates | లెజెండరీ సింగర్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్నారని తెలిసిందే. అయితే బాలుకి తాజాగా జరిపిన కరోనా టెస్టులలో నెగటివ్ (SP Balasubrahmanyam Tested COVID19 Negative)అని వచ్చిందని ప్రచారం జరిగింది. ఆస్పత్రి వర్గాలు తెలిపాయని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ అందులో నిజం లేదని ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ (SP Charan About SP Balu Health) తెలిపారు. అవన్నీ కేవలం వదంతులేని కొట్టిపారేశారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. Sai Dharam Tej: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్!
ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ ప్రకటన
SP Charan speaks and clarifies on #SPbalasubramanyam Covid19 Test#SPcharan #CoronavirusIndia pic.twitter.com/5mW4qYdPd3
— ZEE HINDUSTAN తెలుగు (@ZeeHTelugu) August 24, 2020
తన తండ్రి ఇంకా కరోనాతో పోరాడుతున్నారని స్పష్టం చేశారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి నుంచి సమాచారం అందుకునే తొలి వ్యక్తిని తానేనని చరణ్ తెలిపారు. తన తండ్రి ఎస్పీ బాలు పరిస్థితి ఇంకా అలాగే ఉందని, వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. తాను విషయం చెబితేనే నమ్మాలని, వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్
Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా!
Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి