Adipurush Teaser VFX Vs Hanuman Teaser : ప్రభాస్ ఓం రౌత్ ఆదిపురుష్‌ సినిమాకు పెట్టిన బడ్జెట్ దాదాపు ఐదు వందల కోట్లు. దాని రిజల్ట్ ఎలా ఉండోబోతోందో చిన్న టీజర్ ద్వారా చూపించారు. ఆ టీజర్‌ను కొంప కొల్లేరు చేసింది. టీజర్‌ను చూసి ప్రతీ ఒక్కరూ విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌ను ఏకిపారేశారు. రాముడు, రావణుడు, ఆంజనేయుడు, వానర సైన్యం ఇలా ఉంటుందా? అంటూ పాయింట్ పాయింట్‌ను ట్రోల్స్ చేశారు.  ఈదెబ్బతో ఓం రౌత్ మళ్లీ రిపేర్లు చేసేందుకు పూనుకున్నాడు. దాదాపు వంద కోట్లతో ఆదిపురుష్‌ను మళ్లీ రిపేర్లు చేస్తున్నాడట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు మళ్లీ ఆదిపురుష్‌ టాపిక్ ఎందుకు వచ్చిందనే అనుమానం అందరికీ వచ్చి ఉంటుంది. కానీ హనుమాన్ టీజర్ చూశాక.. మన తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్కడున్నాడు.. ఏ స్థాయిలో విజువలైజ్ చేసుకున్నాడు..ఆ హిందీ డైరెక్టర్ ఏం ఆలోచించాడు.. ఏం తీశాడు అన్నది అనుమానంగా మారుతుంది. హనుమాన్ టీజర్ విజువల్ వండర్‌గా అనిపిస్తుంది.


 



ఇచ్చిన బడ్జెట్‌లో ప్రశాంత్ వర్మ తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. విజువల్స్, హనుమాన్‌ను చూపించిన తీరు అదిరిపోయిందంతే. వాటర్ ఫాల్స్, విశ్వం, అంతరిక్షం ఇలా అన్నీ కూడా అద్భుతంగా కనిపించాయి. చివరి షాట్ అయితే అదిరిపోయింది. కథ ఏంటన్నది స్పష్టంగా చెప్పకపోయినా కూడా ఏదో కొత్తగా ట్రై చేసినట్టు అనిపిస్తోంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ అంటూ ఇలా పార్టులు తీస్తూనే ఉంటాడట.


హనుమాన్ తరువాత.. అధీర అనే సినిమా తీస్తాడట. ఆ తరువాత ఉమెన్ సెంట్రిక్ సినిమా తీస్తాడట. హనుమాన్ కంటే ఈ విశ్వంలో సూపర్ హీరో ఎవ్వరూ లేరంటూ హనుమాన్ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశాడు. ఇలా హనుమాన్ టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో ఆదిపురుష్ టీంను జనాలు ఏకిపారేస్తున్నారు. మరి ఆదిపురుష్‌ టీం చేసే రిపేర్లు అయినా జనాలను శాంతింపజేస్తుందో లేదో చూడాలి.


Also Read : Chiranjeevi IFFI Award : ధర్మం తెలిసిన ధర్మాత్ముడు.. చిరంజీవిపై బండ్ల గణేష్.. ప్రధాని ట్వీట్ వైరల్  


Also Read : Mahesh Babu : గంగానదిలో అమ్మ అస్థికలు.. కృష్ణానదిలో నాన్న అస్థికలు.. పుట్టెడు దుఃఖంలో మహేష్‌ బాబు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook