Prabhas's Adipurush teaser and poster will release on October 2: బాహుబలి 1, బాహుబలి 2తో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న 'రెబల్ స్టార్' ప్రభాస్.. అదే ఫామ్‌తో ముందుకు వెళుతున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమాలలో ఆదిపురుష్ ఒకటి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ముగియగా.. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్‌ చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదిపురుష్ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను డైరెక్టర్‌ ఓంరౌత్‌ స్వయంగా తెలిపారు. ఆదిపురుష్‌ టీజర్‌ను అక్టోబర్‌ 2న అయోధ్య వేదికగా విడుదల చేస్తున్నామని, సినిమాని 2023 జనవరి 12న రిలీజ్‌ చేయబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 'మా మ్యాజికల్‌ ప్రయాణంను  ఇప్పుడు ఎక్స్‌పిరియన్స్‌ చేసే సమయం వచ్చేసింది. ప్రతిఒక్కరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆదిపురుష్‌ సినిమా టీజర్‌, ఫస్ట్‌ పోస్టర్‌ను అక్టోబర్ 2న అయోధ్యలో విడుదల చేస్తున్నాం. సినిమాను 2023 జనవరి 12న ఐమాక్స్‌, 3డీలో థియేటర్లోకి రానుంది' అని ట్వీట్ చేశారు. 



డైరెక్టర్‌ ఓంరౌత్‌ ట్వీటును చూసిన ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. సాహూ, రాధేశ్యామ్ సినిమాలు నిరాశపరచడంతో ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైథలాజికల్‌ సినిమాగ బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓంరౌత్‌ రూపొందించిన ఈ సినిమాలో  ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించారు. బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్‌ సీతగా కనిపించనున్నారు. ఇక బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా అలరించనున్నారు. 


Also Read: దీప్తి శర్మ దెబ్బకు దడుసుకున్న చార్లీ డీన్‌.. వైరల్ అవుతున్న ఇంగ్లండ్ క్రికెటర్ ట్వీట్!
Also Read: IND vs SA: దక్షిణాఫ్రికాతో భారత్ సిరీస్.. వైస్‌ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook