Adivi Sesh unveils Enthavaaru Gaani Teaser : అడివి శేష్ ప్రస్తుతం ఫుల్ ఫాం మీదున్నాడు. హిట్ 2 సినిమాతో హిట్టు కొట్టేశాడు. ఈ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్న అడివి శేష్‌ తాజాగా ఎంతవారుగాని అనే సినిమా టీజర్‌ను రిలీజ్ చేశాడు. అడివి శేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయించడంతో ఈ మూవీ టీజర్ మీద అందరి దృష్టి పడింది. సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రంతో ఎన్ శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఇక ఈ సినిమాను  రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



సైంటిఫిక్  థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ని అడవి శేష్  విడుదల చేశాడు. అనంతరం అడివి శేష్‌ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఇక ఈ టీజర్‌లో రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు బోలెడన్నీ ఉన్నాయని అర్థమవుతోంది. ఇదొక సైంటిఫిక్ సినిమా అని ఇట్టే తెలుస్తోంది. ల్యాబ్‌లో ఏం జరుగుతోంది.. ఏం పరిశోధిస్తున్నారు.. ఎందుకు హత్యలు జరుగుతున్నాయ్.. ఎందుకు అలా చంపేస్తున్నారు అనే ఆసక్తికరమైన ప్రశ్నలో తలెత్తేలా టీజర్‌ను కట్ చేశారు.


రామ్ గోపాల్ వర్మ 'రంగీలా' సినిమాతో దర్శకుడు శ్రీనివాసన్.. ఎన్ ని ‘నివాస్’ అనే పేరుతో ఎడిటర్‌గా పరిచయం చేశాడు. ఆ తర్వాత క్షణ క్షణం, గాయం, గోవిందా గోవిందా, రాత్రి, అంతం, ద్రోహి, మనీ, అనగనగ ఒక రోజు, మృగం, రాత్, మనీ మనీ సినిమాలకు ఆయన సౌండ్ ఇంజినీర్‌గా పని చేసి అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు 'ఎంతవారుగాని' అనే ఈ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించబోతున్నారు శ్రీనివాస్ ఎన్. ప్రవీణ్ కే బంగారి సినిమాటోగ్రఫీ, విజయ్ కురాకుల సంగీతం, JK మూర్తి ఆర్ట్, ఘ్యాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి.


Also Read : Bigg Boss Shiva Jyothi : కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన శివ జ్యోతి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి


Also Read : Jagapathi Babu : అరవై ఏళ్లకు నేర్చుకున్నాడట.. రమ్ము, విస్కీ అంతా అదేనట.. వంటగదిలో జగ్గూ భాయ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook