Imran-Avanthika: టాలీవుడ్ ప్రముఖ జంట నాగచైతన్య వర్సెస్ సమంతల విడాకుల వ్యవహారం ముగియకముందే మరో జంట దూరమౌతోంది. ఈసారి దూరమయ్యేది బాలీవుడ్ జంట కావడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగ చైతన్య వర్సెస్ సమంత ప్రభుల విడాకుల వ్యవహారంపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. పెళ్లై..నాలుగేళ్లు కూడా కలిసుండలేకపోయారు. నిర్ధిష్టంగా కారణం తెలియకపోయినా..కలిసుండలేక విడాకులు తీసుకున్నారు. ఎన్నో పుకార్లు, మరెన్నో చర్చల అనంతరం విడాకుల బాటపట్టారు. సినీ పరిశ్రమలో ఇదంతా సహజమే అయినా అభిమానుల్ని మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది. కారణం ఇద్దరూ అగ్ర నటీనటులు కావడమే. 


ఇక అదే బాటలో బాలీవుడ్‌కు చెందిన మరో జంట ఉంది. అమీర్ ఖాన్ కుటుంబం నుంచి వచ్చిన మరో నటుడు ఇమ్రాన్ ఖాన్ వర్సెస్ అవంతిక మాలిక్. అమ్మాయిల హాట్ ఫేవరైట్‌గా ఉన్న ఇమ్రాన్ ఖాన్..అవంతికను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ఇద్దరికీ ఓ పాప కూడా ఉంది. ఈ ఇద్దరి పెళ్లి కూడా నాగచైతన్య-సమంతలానే హాట్ టాపిక్‌గా మారింది అప్పట్లో. కొన్నేళ్లుగా ఆనందంగానే వైవాహిక జీవితాన్ని గడిపారు. ఆ తరువాత ఇద్దరి మధ్య విబేధాలు మొదలై..ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. త్వరలో విడాకులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇరువురి కుటుంబపెద్దలు చర్చలు జరిపినా..అవంతిక అంగీకరించకపోవడంతో ఇద్దరూ దూరంగానే ఉంటున్నారు. 


సినీ పరిశ్రమలో ఇలాంటివి సహజంగా ఈగో కారణంగా వస్తుంటాయి. ఇరువురు సెలెబ్రిటీలైతే ఈగోలు పెరిగి పెద్దవై..విడాకులకు దారి తీస్తుంటాయి. అందులో సినీ పరిశ్రమలో మరీనూ. అప్పటివరకూ ఉన్న స్వేచ్ఛ..పెళ్లైన తరువాత మనకు తెలియకుండానే చట్రంలో బిగుసుకుపోతుంటుంది. అదే ఇరువురి మధ్య దూరాలకు, విబేధాలకు కారణమౌతుంటుంది. 


Also read: Samantha Ruth Prabhu: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... త్వరలో సామ్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook