Daggubati Abhiram Wedding: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేశ్‌బాబు తనయుడు, హీరో రానా తమ్ముడైన అభిరామ్‌ ఓ ఇంటివాడయ్యారు. డిసెంబర్‌ 6న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది. దగ్గుబాటి ఫ్యామిలీకి దగ్గరి బంధువుల అమ్మాయి ప్రత్యూష చాపరాలను కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకున్నారు అభిరామ్.  ఈ వేడుకకు శ్రీలంకలోని ఓ రిసార్ట్ వేదికగా మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. లంక నుంచి తిరిగి వచ్చాక సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల కోసం  హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనుందట దగ్గుబాటి ఫ్యామిలీ. తాజాగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సురేష్ బాబు, అభిరామ్, వెంకటేష్, రానా మరియు చైతన్య శ్రీలంక ఎయిర్ పోర్టులో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. తేజ దర్శకత్వం వహించిన ‘అహింస’ (Ahimsa) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అభిరామ్. ఈ ఏడాది జూన్ లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌ దక్కించుకుంది. మూవీ రిలీజైన ఆరు నెలల తర్వాత అంటే రీసెంట్ గా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది అమెజాన్. దగ్గుబాటి ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశపరిచిన ఈ చిత్రం ఓటీటీ లవర్స్ ను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. 


Also Read: Polimera 2 OTT: అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ‘'పొలిమేర 2'’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook