AIG Hospital Reveals Reason of Krishnam Raju Death: టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎలా మరణించారనే విషయం మీద ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు. తాజాగా ఈ విషయం మీద ఏఐజీ హాస్పిటల్ ఒక బులెటిన్ ని విడుదల చేసింది. గుండె పోటు రావడంతో కృష్ణంరాజు కన్నుమూశారు అని ఏఐజీ వైద్యులు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణంరాజుకు ముందు నుంచి మధుమేహం గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని దానికి తోడు ఆయన ఊపిరితిత్తులు వ్యాధితో కూడా బాధపడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. కృష్ణంరాజు కుడి కాలుకు గత ఏడాది సర్జరీ జరిగింది. కుడికాలులోని ఒక వేలును కూడా తొలగించారని వారు పేర్కొన్నారు. గత నెల ఆగస్టు 5వ తేదీన పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ ఆయన హాస్పిటల్ లో చేరారని అప్పటి నుంచి ఆయనకు చికిత్స అందిస్తున్నామని వారు బులెటిన్ పేర్కొన్నారు.


ఈ క్రమంలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా  వల్ల ఊపిరితిలో నిమోనియా ఏర్పడిందని దానికి తోటి కిడ్నీలు కూడా పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని ప్రకటించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల 25 నిమిషాలకు మృతి చెందినట్లు ఏఐజీ వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు 11 గంటల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఆయన కుమార్తెలలో ఒకరు విదేశాలలో ఉన్నారని ఆమె వచ్చేవరకు సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం లోపు కృష్ణంరాజు పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి తరలించనున్నారు. రేపు ఉదయం అంత్యక్రియలకు తరలించే సమయంలో ఫిలిం ఛాంబర్ కు ఆయన పార్థివ దేహాన్ని తరలించే అవకాశం ఉందని అంటున్నారు. సందర్శకుల కోసం సుమారు గంట లేదా గంటన్నర పాటు ఆయన పార్థివ దేహాన్ని ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు.


Also Read: Krishnam Raju Last Wish: కృష్ణంరాజు చివరి కోరిక ప్రభాస్ పెళ్లి కాదట.. ఏమిటో తెలుసా?


Also Read: Amit Shah to Meet Prabhas: కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించనున్న అమిత్ షా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి