Krishnam Raju Last Wish: కృష్ణంరాజు చివరి కోరిక ప్రభాస్ పెళ్లి కాదట.. ఏమిటో తెలుసా?

Krishnam Raju Died with out fulfilling Last Wish: తన చివరి కోరిక తీరకుండానే కృష్ణం రాజు కన్నుమూశారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 11, 2022, 10:20 AM IST
Krishnam Raju Last Wish: కృష్ణంరాజు చివరి కోరిక ప్రభాస్ పెళ్లి కాదట.. ఏమిటో తెలుసా?

Krishnam Raju Died with out fulfilling Last Wish: రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో ఈరోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. చిలకా గోరింక సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన సుమారు 187 సినిమాల్లో నటించారు. తన కెరీర్ ముగుస్తుంది అనుకున్న సమయంలో తన తమ్ముడి కుమారుడు ప్రభాస్ ను హీరోగా పరిచయం చేశారు. ఈశ్వర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ప్రభాస్ తర్వాత వరుస హిట్లు అందుకున్నారు.

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన పెదనాన్న పేరు నిలబెట్టారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కృష్ణంరాజు ఆ తర్వాత సినిమాలకు రాజకీయాలకు కూడా దూరమయ్యారు. అయితే తాను స్థాపించిన గోపి కృష్ణ మూవీ సంస్థ బ్యానర్ మీద పలు సినిమాలు నిర్మించడానికి ఆయన ఆసక్తి చూపించారు. అయితే కృష్ణంరాజు మృతి చెందిన నేపథ్యంలో ఆయన చివరి కోరిక అంటూ ప్రభాస్ పెళ్లి గురించి ప్రచారం జరుగుతుంది.

అయితే కృష్ణంరాజు చివరి కోరిక ప్రభాస్ పెళ్లి చేసుకోవడం కాదట. ప్రభాస్ పెళ్లి చేసుకుని ఆయనకు సంతానం కలిగితే ఆ సంతానంతో కూడా కలిసి నటించాలనేది కృష్ణంరాజు చివరి కోరిక అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన పలుసార్లు తన కుటుంబ సభ్యుల దగ్గర వెల్లడించారని తెలుస్తోంది. గతంలో ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు అనేకసార్లు స్పందించారు. ఆయనకు మంచి జోడీ కోసం వెతుకుతున్నామని, అయితే ప్రభాస్ పెళ్లి విషయంలో ఆసక్తి చూపించడం లేదని ఆయన గతంలో పేర్కొన్నారు.

అలాగే ప్రభాస్ పెళ్లి చూడాలని ఉందని కూడా కృష్ణంరాజు అనేక సందర్భాలలో ప్రస్తావించారు. ప్రభాస్ కోసం మంచి అమ్మాయిని చూస్తున్నామని త్వరలోనే ఆయన పెళ్లికి సంబంధించిన అప్డేట్ ఇస్తామని కూడా వెల్లడించారు. ఇక ప్రభాస్ పెళ్లి కాకపోవడంతో ఆయన పిల్లలకు కలిసిన నటించాలనే కృష్ణంరాజు కోరిక తీరకుండానే చనిపోయినట్లుంది.

Also Read: Reason for Krishnam Raju Death: ఆ కారణంతోనే కృష్ణంరాజు మృతి.. కొంప ముంచిన కరోనా.. అసలు ఏమైందంటే?

Also Read: Krishnam Raju Death: దిగ్గజ నటుడు కృష్ణంరాజు మరణంపై హీరోలు మంచు మనోజ్, నిఖిల్ రియాక్షన్..

Trending News