Amit Shah to Meet Prabhas: కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించనున్న అమిత్ షా!

Amit Shah to Meet Krishnam Raju Family Members: కేంద్ర మంత్రి అమిత్ షా కృష్ణం రాజు కుటుంబ సభ్యులను కలిసి సంతాపం వ్యక్తం చేయనున్నారు. వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 11, 2022, 10:18 AM IST
Amit Shah to Meet Prabhas: కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించనున్న అమిత్ షా!

Amit Shah to Meet Krishnam Raju Family Members: ఈనెల 16వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే.  17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనే అవకాశం ఉంది. ఇక 17వ తేదీ హైదరాబాద్ వచ్చిన సమయంలో హీరో నిఖిల్ తో అమిత్ షా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

అయితే బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్న కృష్ణంరాజు కన్నుమూయడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక రోజు ముందుగానే హైదరాబాద్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. లోకల్ బీజేపీ లీడర్లు కృష్ణంరాజు అంత్యక్రియలో కూడా పాల్గొనే అవకాశాలు ఉండగా పదహారో తేదీ అమిత్ షా కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలిసి వారికి సంతాపం వ్యక్తం చేయబోతున్నారు. అదే రోజు ప్రభాస్ కూడా అక్కడే ఉండేలా బిజెపి నేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మనల్ని విడిచిపెట్టారని తెలి‌సి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, ఆయన బహుముఖ నటనతో, సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారని ట్వీట్ చేశారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటును మిగిల్చింది, ఓం శాంతి అని అమిత్ షా ట్వీట్ చేశారు. 1991 లో కాంగ్రెస్ లో చేరిన కృష్ణంరాజు నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో రాజకీయాలకు బ్రేక్ తీసుకుని ఆయన మళ్ళి 96 లో బిజెపిలో చేరి కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

ఏడాదిలోనే మద్యంతర ఎన్నికలు రావడంతో మరోసారి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడమే గాక వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత 2004 ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే బీజేపీతో గతంలో సన్నిహితంగా మెలిగిన ఆయన తర్వాత కూడా పలు సందర్భాల్లో ప్రధానమంత్రి మోడీ వంటి వారిని కలిశారు.

Also Read: Krishnam Raju Last Wsh: కృష్ణంరాజు చివరి కోరిక ప్రభాస్ పెళ్లి కాదట.. ఏమిటో తెలుసా?

Also Read: Reason for Krishnam Raju Death: ఆ కారణంతోనే కృష్ణంరాజు మృతి.. కొంప ముంచిన కరోనా.. అసలు ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News