Aishwarya Bhaskaran opens up about facing online harassment: ప్రముఖ నటి లక్ష్మి తెలుగు వారందరికీ సుపరిచితమే. తమిళ సినిమాలతో తెరంగ్రేటం చేసినప్పటికీ ఆమె తెలుగులో కూడా అనేక సినిమాల్లో నటించారు. ఇక ఆమె కుమార్తె ఐశ్వర్య భాస్కరన్ కూడా తెలుగు వారందరికీ పరిచయమే, కానీ నేరుగా తక్కువ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 తెలుగు సినిమాల్లో నటించిన తమిళ డబ్బింగ్ సినిమాలతో ఎక్కువగా తెలుగువారికి పరిచయమయ్యారు. నిజానికి ఆమె మలయాళ సినిమాల్లో సైతం ఎక్కువగానే నటిస్తూ వచ్చారు. తాజాగా ఆమె లైంగిక వేధింపులకు గురైనట్లుగా ఒక యూట్యూబ్ ఛానల్ లో వెల్లడించారు. ఆన్ లైన్ లో తాను ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి ఐశ్వర్య మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ మల్టీ మమ్మీలో ఆమె స్పందించారు. చాలామంది నెటిజన్లు ఆన్లైన్లో తనకు అసహ్యకరమైన మెసేజ్ లు పంపారని అది తనని ఎంతగానో బాధకు గురి చేసిందని చెప్పుకొచ్చారు.


Also Read: Naveen Yerneni hospitalised: వరుస ఐటీ రైడ్స్.. మైత్రీ నవీన్ కు అస్వస్థత..హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు!


కొన్ని ఫోటోలు, మెసేజ్ లు తనకు మానసిక వేదనకు గురిచేశాయని ఐశ్వర్య ఈ సందర్భంగా వెల్లడించారు. ఏకంగా ఒక వ్యక్తి అయితే తనకు అర్ధరాత్రి సమయంలో మెసేజ్ పంపాడని ఆమె పేర్కొన్నారు. నిజానికి ఆమె ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో సబ్బులు అమ్ముతున్నట్లుగా ఆమధ్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో అర్థరాత్రి సమయంలో మెసేజ్ పంపి ఇప్పుడు వచ్చి మీ సబ్బులు చూడవచ్చా అని కోరాడని ఆమె కామెంట్ చేసింది.


ఇక సబ్బుల అమ్మకంతో పాటుగా యూట్యూబ్ ఛానల్ లో కూడా రకరకాల వంటలు చేస్తూ వీడియోలు పెడుతోంది. ఆమె అదే విధంగా సబ్బులు తయారీ వీడియోలు, ఆధ్యాత్మిక అంశాల మీద కూడా ఆమె వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తుంది. ఇక తనను చాలామంది పురుషులు ఆన్ లైన్ లో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఒంటరిగా ఉండే తనకు ఈ విషయం ఇబ్బందికరంగా అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.


అయితే తన మీద జరుగుతున్న వేధింపులను తాను సోషల్ మీడియాలో బహిర్గతం చేయడంతో కొందరు తనకు సపోర్టుగా కూడా నిలిచారని ఆమె చెప్పుకొచ్చింది. పాజిటివ్ కామెంట్స్ చేసి తనకు మద్దతుగా నిలబడ్డారని తనకు కొంత ధైర్యం కూడా వచ్చిందని అని చెప్పుకొచ్చారు. అయితే ఐశ్వర్య భాస్కరన్  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆమె పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది కానీ ఆ విషయంలో క్లారిటీ లేదు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook