Aishwarya Rajinikanth's maid and car driver arrested: మిస్టరీగా మారిన నగల చోరీ కేసులో నటుడు రజనీకాంత్ కుమార్తె, ధనుష్ మాజీ భార్య, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పని చేస్తున్న పనిమనిషిని పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య కొద్దిరోజుల క్రితం తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో తన ఇంట్లో నగలు, డైమండ్లు మిస్ అయ్యాయని ఫిర్యాదు చేసింది. ఆమె ప్రస్తుతం బోయిస్‌ గార్డెన్స్‌లోని మా నాన్న రజనీకాంత్‌ ఇంట్లో ఉంటున్నానని, 2019లో మా చెల్లెలు పెళ్లి కావడంతో ఆ రోజు నుంచి నా ఆభరణాలను లాకర్‌లో ఉంచానని ఆమె పేర్కొంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాకర్ లో సంప్రదాయ ఆభరణాలతో పాటు దాదాపు 60 తులాల బంగారు, వజ్రాల నగలు ఉన్నాయని ఆమె పేర్కొంది. ఇక 2021 వరకు ఆళ్వార్‌పేట సెయింట్‌ మేరీస్‌ రోడ్డులోని ఇంట్లో, ఆ తర్వాత సీఐటీ నగర్‌లోని భర్త ఇంట్లో, ఆ తర్వాత బోయిస్‌ గార్డెన్‌కు వెళ్లే సమయానికి లాకర్‌ను ఆ మూడు చోట్లకు మార్చాను కానీ ఓపెన్ చేసి చూడలేదని పేర్కొంది. అలాగే తాను సెయింట్ మేరీస్ రోడ్‌లోని ఒక ఫ్లాట్‌లో ఇంట్లో ఉన్నప్పుడు లాకర్ కీని అల్మారాలో ఉంచానని, ఈ విషయం తన ఇంట్లో పనిచేసే ఇంటి పనిమనిషి ఈశ్వరి, లక్ష్మి, కారు డ్రైవర్ వెంకట్‌లకు తెలుసని పేర్కొన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో కూడా వారు ఇంట్లో ఉండేవారని ఆమె అనుఅమానం వ్యక్తం చేశారు.


 గత నెల 10వ తేదీన లాకర్ తెరిచి చూడగా అందులో కొన్ని నగలు మాత్రమే ఉన్నాయని, చాలా విలువైన అలాగే సాంప్రదాయ ఆభరణాలు కనిపించలేదని ఆమె పేర్కొంది. ఈ  విషయమై నా ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురిపై అనుమానాలు ఉన్నాయని, .పోలీసు శాఖ విచారణ జరిపి నా నగలు  రికవరీ చేయాలని కోరింది. . దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఐశ్వర్య అందించిన ఫొటోల ఆధారంగా పనిమనిషిని, కారు డ్రైవర్‌ను విచారించారు. పనిమనిషి ఈశ్వరి గత 4 సంవత్సరాలుగా కొద్దికొద్దిగా నగలు చోరీ చేస్తోందని గుర్తించారు. ఆమె నుంచి ఇప్పటి వరకు 20 తులాల నగలు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత ముమ్మరంగా విచారణ చేపట్టామని, మిగిలిన ఆభరణాల రికవరీ కొనసాగుతున్నట్లు సమాచారం.


డ్రైవర్ వెంకటేశన్‌ బెదిరింపులతో పనిమనిషి ఈశ్వరి సుమారు 100 సవర్ల బంగారు ఆభరణాలు, 30 గ్రాముల వజ్రాభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులను అపహరించిందని తేలింది. ఇక వారిద్దరూ వాటిని విక్రయించి, వచ్చిన మొత్తాన్ని ఇక్కడ ఇంటి కొనుగోలు కోసం ఉపయోగించారని గుర్తించారు. ఇక అలాగే కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా ఉపయోగించినట్లు పోలీసులు తేల్చారు. 18 సంవత్సరాలుగా పనిమనిషిగా ఉద్యోగం చేస్తున్న ఈశ్వరికి ఐశ్వర్య రజనీకాంత్ ఇంటి గురించి బాగా తెలుసని, అందుకే ఆమె లాకర్‌ను చాలాసార్లు తెరిచి దొంగతనం చేసిందని గుర్తించారు. పనిమనిషి నుండి దొంగిలించబడిన, కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు, ఆమె ఇంటి కొనుగోలుకు సంబంధించిన పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
Also Read: Honeyrose New Saree Photos: స్లీవ్ లెస్ బ్లాజ్, వయలెట్ కలర్ శారీలో హనీ రోజ్ అందాలు.. చూడతరమా?


Also Read: Priyanka Jawalkar Latest Saree Photos: శారీలో అంతా చూపిస్తున్న తెలుగమ్మాయి.. క్లీవేజ్ ట్రీట్ తో పాటు నడుమందాలు కూడా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook