Akhanda OTT streaming: నందమూరు నట సింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna latest movie) హీరోగా నటించిన 'అఖండ' సినిమా.. గత ఏడాది డిసెంబర్2న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీనితో బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబినేషన్ హ్యాట్రిక్ (Akhanda Movie success) కొట్టినట్లైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ దాదాపు రూ.150 కోట్లు వసూళ్లు సాధించిది. కొవిడ్​ భయాలు కొనసాగుతున్న సమయంలోనూ భారీ వసూళ్లు రాబట్టి.. పెద్ద సినిమాలన్నింటికి (Akhanda Movie Collections) ఆశాకిరణంగా నిలించింది.


ఇంకా చెప్పాలంటే.. గత ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన రెండో పెద్ద తెలుగు సినిమా 'అఖండ' కావడం విశేషం. మొదటి స్థానంలో అల్లు అర్జున్ నటించిన (Biggest Hit Telugu Cinema in 2021) పాన్ ఇండియా సినిమా 'పుష్ప' నిలిచింది.


అఖండ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్​ చేసిన బాలయ్య ఫ్యాన్స్​కు నేటి నుంచి ఆ సంతోషం రెట్టింపు కానుంది. ఎందుకంటే.. 'అఖండ' సినిమా నేడే ఓటీటీలో (Akhanda OTT release) విడుదలవనుంది.


కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారందరికి ఇది గుడ్​న్యూస్ అనే చెప్పాలి. దీనితో పాటు బాలయ్య సినిమా మళ్లీ మళ్లీ చూడాలనుకునే అభిమానులకు కూడా ఇది మంచి వార్తే.


ఏ ఓటీటీ ప్లాట్​ఫామ్​లో రిలీజ్​?


ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ డిస్నీ హాట్​స్టార్​.. 'అఖండ' మూవీ స్ట్రీమింగ్​ రైట్స్​ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచే (జనవరి 21) స్ట్రీమింగ్​ చేయనుంది. నేటి సాయంత్రం 6 గంటల నుంచి ఈ మూవీవి చూసేందుకు (Akhanda OTT streaming time) వీలుంది.


అఖండ మూవీ స్ట్రీమింగ్ రైటన్స్​ను  హాట్​స్టార్ రూ.15 కోట్లకు కొనుగోలు చేసినట్లు (Akhanda in Disney Hotstar) అంచనాలున్నాయి.



అఖండ సినిమా గురించి..


ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరాగా కనిపించారు. కొత్త లుక్​లో బాలకృష్ణ పేల్చే మాస్​ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.


బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal in Akhanda) హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషించారు.


ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఎం రత్నం డైలాగ్స్ అందించారు. ద్వారకా క్రియేషన్స్​ బ్యానర్​పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్​ (రూ.60-70 కోట్లు)తో ఈ సినిమాను (Akhanda movie Budget) తెరకెక్కించారు.


Also read: Sam-Chai divorce: సమంత, నాగచైతన్య మళ్లీ ఒక్కటవుతున్నారా.. అందుకే సామ్ అలా చేసిందా..


Also read: Sushath Singh Rajput : సుశాంత్ లేడంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు.. ఆ నవ్వు ముఖాన్ని ఎవరైనా ఎలా మరిచిపోగలరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook