Samantha Naga Chaitanya divorce issue: సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై గత కొంతకాలంగా అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో ఎడ తెగని చర్చ జరుగుతోంది. సమంత, చై ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా గడుపుతుంటే... ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ ఈ జంట విడాకులపై రంధ్రాన్వేషణ చేస్తూనే ఉన్నారు. తాజాగా సమంత-నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారా అంటూ కొత్త చర్చకు తెరలేపారు.
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి విడాకుల ప్రకటనకు సంబంధించిన పోస్టును తొలగించడం ఈ చర్చకు, సందేహాలకు తావిచ్చింది. నాగచైతన్యతో విడిపోతున్నట్లు చేసిన ప్రకటనను సమంత తొలగించిందంటే... ఈ జంట మళ్లీ కలవబోతున్నారేమోనని ఫ్యాన్స్ సందేహాలు వెలిబుచ్చుతున్నారు. అయితే ఇన్‌స్టా నుంచి పోస్టును తొలగించినంత మాత్రాన సమంత-చైతన్య మళ్లీ కలవబోతున్నారనే నిర్దారణకు రావడమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
నాగా చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికీ విడాకుల ప్రకటనకు సంబంధించిన పోస్టు అలాగే ఉంది. ఒకవేళ ఈ ఇద్దరూ మళ్లీ కలిసే ఛాన్స్ ఉంటే.. సమంత లాగే చైతన్య కూడా ఆ పోస్టును డిలీట్ చేసేవాడు కదా అనే సందేహం తలెత్తక మానదు. ఆ పోస్టును పదే పదే చూసుకుని బాధపడటం ఇష్టం లేకనో.. లేక అనవసరమని భావించో సమంత దాన్ని డిలీట్ చేసి ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమాల విషయానికొస్తే.. నాగ చైతన్య (Samantha Naga Chaitanya Divorce) హీరోగా నటించిన 'బంగార్రాజు' చిత్రం సంక్రాంతికి విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన ఏడు రోజులకు రూ.33.45 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక సమంత నటించిన తమిళ సినిమా 'కాతువాకుల రెండు కాదల్' విడుదలకు సిద్దంగా ఉంది. ఇదే ఏడాది 'అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ సినిమాలోనూ సమంత నటించనుంది.
Also Read: Akshar Patel Engagement: అక్షర్ పటేల్ బర్త్‌డే నాడే ప్రేయసితో ఎంగేజ్మెంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook