Sushath Singh Rajput : సుశాంత్ లేడంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు.. ఆ నవ్వు ముఖాన్ని ఎవరైనా ఎలా మరిచిపోగలరు

Sushant Singh Rajput 36th Birth Anniversary : ఇవాళ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 36వ జయంతి. సుశాంత్ అభిమానులు ఇప్పటికీ అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నారు. సుశాంత్ జయంతి సందర్భంగా అతని సినిమాలు, మాటలు, కెరీర్‌ను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 11:02 AM IST
  • ఇవాళ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 36వ జయంతి
  • సుశాంత్‌ను మిస్ అవుతున్నామంటూ ఫ్యాన్స్ ట్వీట్స్
  • సుశాంత్ సినిమాలు, కెరీర్‌ను మరోసారి గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్
 Sushath Singh Rajput : సుశాంత్ లేడంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు.. ఆ నవ్వు ముఖాన్ని ఎవరైనా ఎలా మరిచిపోగలరు

Sushant Singh Rajput 36th Birth Anniversary : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్... యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ప్రతిభతో ఎదిగొచ్చిన నటుడు. బాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో బుల్లితెరపై పలు టీవీ సీరియల్స్‌లో నటించిన సుశాంత్.. ఆ తర్వాత వెండితెరకు ప్రమోట్ అయ్యాడు. ఎంఎస్ ధోనీ, చిచోరే వంటి చిత్రాలతో సొంత ఇమేజ్, ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. సుశాంత్ భవిష్యత్‌లో స్టార్‌ హీరోగా మారుతాడని అంతా భావిస్తున్న తరుణంలో.. అర్ధాంతరంగా తనువు చాలించి అందరినీ షాక్‌కి గురిచేశాడు. సుశాంత్ మరణించి ఏడాదిన్నర గడిచినా... ఇప్పటికీ అభిమానులు అతన్ని మరిచిలేకపోతున్నారు. 

నేడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 36వ జయంతి. ఈ నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సుశాంత్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ నివాళులు అర్పిస్తున్నారు. మిస్ యూ సుశాంత్ అంటూ భావోద్వేగపూరితంగా స్పందిస్తున్నారు. సుశాంత్ లేడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని అభిప్రాయపడుతున్నారు. సుశాంత్ కెరీర్, సినిమాలను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జనవరి 21, 1986న బిహార్‌లోని పాట్నాలో జన్మించాడు. ఆ తర్వాత ఢిల్లీకి మారిన సుశాంత్ అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 2008లో 'కిస్ దేశ్ మెయిన్ హై మేరా దిల్' అనే హిందీ సీరియల్‌తో బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చాడు. 

సుశాంత్ సింగ్ బుల్లితెరపై 'కిస్ దేశ్ మెయిన్ హై మేరా దిల్', పవిత్ర రిష్తా, జరా నాచ్‌కే దిక్తా, ఝలక్ దిక్లా జా, సీఐడీ వంటి సీరియల్స్, రియాలిటీ షోల్లో కనిపించాడు. 2013లో సుశాంత్ కాయ్ పొ చే చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. శుద్ధ్ దేశీ రొమాన్స్, పీకే, ఎంస్ ధోని అన్‌టోల్డ్ స్టోరీ, రాబ్తా, వెల్‌కమ్ న్యూయార్క్, కేదార్‌నాథ్, చిచోరే, దిల్ బేచారా వంటి చిత్రాల్లో నటించాడు. ఉత్తమ నటుడిగా పలు అవార్డులు అందుకున్నాడు.

జూన్ 14, 2020 సుశాంత్ అభిమానులు షాక్‌లో మునిగిపోయిన రోజు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ విగతజీవిగా కనిపించాడు. పోస్టుమార్టమ్ రిపోర్టులో అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. సుశాంత్ ఆత్మహత్యపై ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది.

సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సుశాంత్ (Sushanth Singh Rajput) అభిమానులు బాలీవుడ్‌లోని బడా నిర్మాతలు, దర్శకులపై విరుచుకుపడ్డారు. ఒకానొక సందర్భంలో సుశాంత్ సైతం బాలీవుడ్‌లో నెపోటిజంపై బాహాటంగానే మాట్లాడాడు. 'నెపోటిజం ఉంది.. అది బాలీవుడ్‌లోనే కాదు, ప్రతీ చోటా ఉంది. దానికి మనమేమీ చేయలేం. అయితే ఉద్దేశపూర్వకంగా ప్రతిభను అడ్డుకుంటే అప్పుడు సమస్యలు తలెత్తుతాయి. మొత్తం పరిశ్రమ కుప్పకూలుతుంది.' అంటూ సుశాంత్ చేసిన వ్యాఖ్యలను అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు.

Also Read: Suicide: ప్రముఖ దర్శకుడి బావ ఆత్మహత్య... ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News