Akkineni Akhil about Surendar Reddy Injury: అక్కినేని హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఏజెంట్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు మూడేళ్ల నుంచి ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది, కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం సరైన క్లారిటీ లేదు. ఎట్టకేలకు ఈ సినిమాని ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. మొట్టమొదటిసారిగా ఈరోజు మీడియాతో మాట్లాడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత అనిల్ సుంకర సమాధానాలు కూడా చెప్పారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా సురేందర్ రెడ్డి గాయపడటం గురించి ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే దానికి అఖిల్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు/ ఎందుకంటే సాధారణంగా యాక్షన్ సీక్వెన్స్ లాంటివి షూట్ చేసేటప్పుడు హీరోలు గాయపడతారు కానీ డైరెక్టర్ ఎలా గాయపడ్డారు అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు.


ఇదీ చదవండి: Dasara Real Story: దసరా కధ నిజంగానే అక్కడ జరిగిందట.. మరీ ఇంత అరాచకమా?


ఈ నేపథ్యంలో ఇదే విషయాన్ని అడిగితే అఖిల్ స్పందిస్తూ తనకు తగలవలసిన దెబ్బ సురేందర్ రెడ్డికి తగిలిందని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి ఒక చిన్న సెట్లో ఎక్కడో పైన ఫ్లోర్ మీద షూట్ చేస్తుంటే గాలి ఎక్కువగా వీచిందని చెప్పుకొచ్చారు. చిన్న సెట్ అయినా సరే చెక్క ఇనుప ప్రేమలతో బలంగా ఉండడంతో అది గనక మీద పడితే కచ్చితంగా దెబ్బ తగలడం ఖాయమని అన్నారు. గాలికి ఆ సెట్ అకస్మాత్తుగా పడి పోవడం ప్రారంభం అవ్వడంతో నా మీద పడబోయిందని అన్నారు.


అది నా మీద పడుతున్న విషయం అర్థం చేసుకుని సురేందర్ రెడ్డి కాపాడడానికి వచ్చారని ఆ చెట్టుకి సంబంధించిన చెక్క, ముక్క నా తల మీద పడి విరిగిపోతే సురేందర్ రెడ్డి మీద మాత్రం ఇనుప ఫ్రేమ్ పడిపోయిందని, అలా ఆయన కాలికి గాయం అయిందని అని చెప్పుకొచ్చారు. ఆ రోజు నాకు తగలల్సిన దెబ్బ సురేందర్ రెడ్డికి తగిలిందని సెట్లో ఎంతో మంది ఉన్నారు. కానీ ఎవరూ రాక పోయినా ఆయనే వచ్చారని హీరో అవడానికి ప్రయత్నించి దెబ్బ తగిలించుకున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయాన్ని నటుడు అలీ రజా ట్వీట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. షూట్ ఉండడంతో కట్టు కట్టించుకుని మళ్ళీ వచ్చి షూటింగ్ ప్రారంభించారని అలీ రెజా చెప్పుకొచ్చాడు. 


ఇదీ చదవండి: Tamannaah Skin Secret: బయటపడ్డ తమన్నా బ్యూటీ సీక్రెట్.. ముఖానికి ఏమి రాసుకుంటుందో తెలిస్తే యాక్ ఛీ అంటారు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook