Naga Chaitanya New Movie Update: నాగ చైతన్య పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది సమంత. విడాకుల అనంతరం  నాగచైతన్య సమంత ఇద్దరు పూర్తిగా కెరీర్ పైనే దృష్టి సారించారు. నాగ చైతన్య జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తుంటే సమంత కూడా వరుస సినిమాలకు సైన్ చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య కెరీర్‌ పరంగా జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. లవ్‌స్టోరీ, వెంకీమామ,  బంగార్రాజు మూవీలతో బ్యాక్‌ టు బ్యాక్‌ సూపర్ హిట్‌లను సొంతం చేసుకున్న నాగ చైతన్య..‘థ్యాంక్యూ’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు హిందీలోకి అరంగ్రేటం చేస్తూ అమీర్‌ ఖాన్‌తో `లాల్‌ సింగ్‌ చద్దా` మూవీలో నటిస్తున్నారు. ఇలా వరుస మూవీలతో ఫుల్‌ బీజీగా ఉంటూనే.. మరోవైపు ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.


ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం దూత పేరుతో వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇలా వరుస మూవీలు, వెబ్‌ సిరీస్‌లతో ఫుల్‌ బిజీగా ఉన్న నాగ చైతన్య.. తాజాగా మరో కొత్త సినిమా ప్రకటించి అక్కినేని ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచారు. తొలిసారి ఆయన తెలుగు, తమిళం భాషల్లో చేసేందుకు రెడీ అయ్యారు. తమిళ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో నాగ చైతన్య ఓ సినిమా చేయబోతున్నారు.



ఈ సినిమాని  శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై  శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఇది అక్కినేని నాగచైతన్య నటిస్తున్న 22వ మూవీ కావడం విశేషం. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనే విషయాలపై త్వరలోనే  క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.


Also Read: Viral Video: వధువు కోపానికి బోరున ఏడ్చేసిన వరుడు- ఏం జరిగిందంటే?


Also Read: KKR Vs MI: ముంబయి X కోల్ కతా.. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ లలో పైచేయి ఎవరిది?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook