Nagarjuna: నేడు నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున హాజరుకానున్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా. నిన్న ఈ కేసుపై విచారణ జరిగింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. నేడు పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్ట్ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో కోర్టుకు నాగార్జున హాజరు కానున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని నమోదు చేయాలని అక్కినేని ఫ్యామిలీ  తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు.మరోవైపు కొండా సురేఖపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం కలిగించిన నేపథ్యంలో రూ. 100 కోట్లకు పైగా పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే కదా. ఇక నాగార్జునకు చెందిన అక్కినేని ఫ్యామిలీ పరువుుక భంగం కలిగించేలా  మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మొత్తం సినీ ఇండస్ట్రీ ఏకమై ఒక్కతాటిపై నిలబడటం విశేషం. సమంతతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి కుటుంబంగా  పేరు తెచ్చుకున్న  అక్కినేని ఫ్యామిలీపై  అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పెద్ద కలకలమే రేగింది.  నాగార్జున ఫ్యామిలీపై నోటితో అనకూడని మాటలతో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆమె క్షమాపణలు కోరింది.  


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


కొండా సురేఖ.. ఓ కార్యక్రమంలో భాగంగా  తనపై కేటీఆర్ అండ్ టీమ్ తనపై  కావాలనే  ట్రోలింగ్ చేయించినట్టు చెప్పడం వరకు ఒకే. ఆయన్ని  రాజకీయంగా విమర్శిస్తే ఆమెకు మైలేజ్ వచ్చేది. కానీ అవనసరంగా ఈ ఇష్యూతో సంబంధం లేని సమంతతో పాటు అక్కినేని ఫ్యామిలీని రాజకీయంగా రోడ్డు కీడ్చడంపైనే రచ్చ నడుస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారంతో పాటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కూడా రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో ఇస్తామన్న గద్దర్ అవార్డులను కూడా బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన పేరు మీద గాయకుడికి ఓ అవార్డు ఇస్తే ఓకే గానీ.. మొత్తం అవార్డులను సినీ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తి పేరు మీదున ఇవ్వడం సబబు కాదంటున్నారు. మరోవైపు  తెలంగాణ నుంచి బాలీవుడ్ వెళ్లి జెండా ఎగరేసిన పైడి జైరాజ్ తో పాటు కాంతారావు పేరుతో గానీ.. దాశరథి, సినారె వంటి ప్రముఖుల పేర్లతో అవార్డులు వస్తే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా కొండా సురేఖ తీరుతో కాంగ్రెస్ పార్టీ సినీ ఇండస్ట్రీతో పాటు ప్రజల్లో పలుచన అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter