Akshay Kumar: డిస్కవరీ చానెల్ లో బేర్ గ్రిల్స్ తో అక్షయ్ కుమార్
ఇంటు ది వైల్ద్ షోలోలో బేర్ గ్రిల్స్ తో ( #IntoTheWildWithBearGrylls ) కలిసి సందడి చేసిన అక్షయ్ కుమార్ ( Akshay Kumar ).
ఇంటు ది వైల్ద్ షోలోలో బేర్ గ్రిల్స్ తో ( #IntoTheWildWithBearGrylls ) కలిసి సందడి చేసిన అక్షయ్ కుమార్ ( Akshay Kumar ). దీనికి సంబంధించిన ట్రైలర్ నెట్టింట సందడి చేస్తోంది. ఈ విషయం అక్షయ్ కుమార్ స్వయంగా ట్వీట్ చేసి అభిమమానులతో పంచుకున్నాడు. ఈ షోలో హైలైట్ విషయం అక్షయ్ కుమార్, బేర్ గ్రిల్స్ ( Bear Grylls ) కలిసి ఏనుగు షిట్ తో చేసిన టీ తాగుతారు. టీ తాగిన అక్షయ్ కుమార్ దీన్ని మ్యాడ్ వెంచర్ అని సరదాగా అంటాడు. ఈ ఎపిసోడ్ లో అక్షయ్ కుమార్ కొన్ని స్టంట్స్ కూడా చేసి చూపిస్తాడు.
బేర్ గ్రిల్స్ తో షో అంటే భారీ లెవల్లో యాక్షన్స్ సీన్స్ ఉంటాయి అనుకున్నా.. భారీ స్టంట్స్ చేయాల్సి ఉంటుంది అనుకున్నా కానీ బేర్ గ్రిల్స్ నాతో ఏనుగు షిట్ తో చేసిన టీ తాగించాడు అని ట్వీట్ చేశాడు అక్షయ్ కుమార్. ఇంతకు ముందు బేర్ గ్రిల్స్ తో కలిసి ప్రధాని నరేంద్రమోదీ, రజినీకాంత్ ఈ షోలో కనిపించారు. ఈ షో సెప్టెంబర్ 11న రాత్రి 8 గంటలకు డిస్కవరీ టెలికాస్ట్ చేయనున్నారు.