Alia Bhatt: తెలుగు నేర్చుకుంటున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ
కథానాయికలైన తెలుగమ్మాయిలకు..హిందీ అమ్మాయిలకు తేడా అక్కడే కన్పిస్తుంటుంది. తెలుగమ్మాయిలు డబ్బింగ్ పై అధారపడుతుంటే..హిందీ అమ్మాయిలు మాత్రం భాష నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.
కథానాయికలైన తెలుగమ్మాయిలకు..హిందీ అమ్మాయిలకు తేడా అక్కడే కన్పిస్తుంటుంది. తెలుగమ్మాయిలు డబ్బింగ్ పై అధారపడుతుంటే..హిందీ అమ్మాయిలు మాత్రం భాష నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.
సినీ పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్టు ( Dubbing Artists ) లకు ప్రత్యేక స్థానముంది. ఇతర భాషల్నించి వచ్చిన హీరోయిన్లకైనా..లేదా కథానాయికలుగా రాణిస్తున్న తెలుగమ్మాయిలకైనా సరే డబ్బింగ్ ఆర్టిస్ట్ కావల్సిందే. ఇప్పుడు కాస్త ట్రెండ్ మారుతోంది. తెలుగమ్మాయిల సంగతేమో గానీ..ఇతర భాషల హీరోయిన్లు మాత్రం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోడానికి ఇష్టపడుతున్నారు. ఒకట్రెండు సిసిమాలు చేయగానే..తెలుగు నేర్చుకుని మాట్లాడటం, డబ్బింగ్ అలవర్చుకోవడం చేస్తున్నారు. అదే కోవలోకి చెందుతుంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ( Bollywood actress Alia Bhatt ) .
ముంబైకు చెందిన బాలీవుడ్ నటి , ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ ( Mahesh Bhatt ) తనయురాలైన అలియా భట్ చాలా యాక్టివ్. రాజమౌళి ( Director Rajamouli ) దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ( RRR Movie ) లో చరణ్ ( Ram charan ) సరసన సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలియా భట్ సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి సిద్ధపడుతోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్లో తనపాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకే తెలుగు ట్యూటర్ ను పెట్టుకుని భాష నేర్చుకుంటోంది.
లాక్ డౌన్ ( Lockdown ) అనంతరం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైంది. కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ నేపధ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువమందితో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పై సన్నివేశాల్ని చిత్రీకరిస్తుండగా..అలియా భట్ మాత్రం వచ్చే నెలలో షూటింగ్ లో పాల్గొననుంది. ఈ గ్యాప్ లో తెలుగు నేర్చుకోడానికి అలియా భట్ సిద్ధమైంది. Also read: Prabhas: ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్