Alia Bhatt Pakistan Fan: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మహేశ్ భట్ కుమార్తెగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్.. తొలి చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో హిందీ ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటిస్తూ ఎంతోమంది అభిమానాన్ని చూరగొంది. ఆమెకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. పాకిస్థాన్‌లో ఓ నటుడు అలియా భట్ సినిమా చూడటానికి మొత్తం థియేటర్‌ని బుక్ చేశాడు. అవును, మీరు విన్నది నిజమే! ఓ పాకిస్థానీ నటుడు తన భార్యను సినిమా చూపించేందుకు థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆలియా భట్ ఇటీవలే 'గంగూబాయ్ కతియావాడి' అని చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తొలుత ఈ చిత్రం కొన్ని వివాదాల్లో చిక్కుకున్నా.. ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో ఆలియా భట్.. వేశ్యగా, లేడీ డాన్ గా నటించింది. ఆమె నటనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఫిదా అవ్వడం సహా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలను అందుకుంది. 


[[{"fid":"225429","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


భార్య కోసం థియేటర్ బుక్..


పాకిస్థాన్ కు చెందిన నటుడు మునీబ్ భట్.. అతడి భార్య ఐమాన్ ఖాన్ 'గంగూబాయ్ కతియావాడి' చిత్రాన్ని ఇటీవలే చూశారు. అయితే ఆ చిత్రాన్ని తన భార్యకు ప్రత్యేకంగా చూపించేందుకు మునీబ్ భట్ ఏకంగా ఓ థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడు. ఆలియా భట్ పై వారిద్దరికీ విపరీతమైన అభిమానం కారణంగా ఈ పని చేసినట్లు తెలుస్తోంది.  


Also Read: Ghani Special Song Video: గని మూవీ నుంచి సర్ ప్రైజ్.. తమన్నా స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్!


Also Read: Nagumomu Tharale Video Song: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'నగుమోము తారలే' సాంగ్ వీడియో రిలీజ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebookv