Alia Ranabir Wedding: త్వరగా పిల్లల్ని కనాలి... కాబోయే జంటపై సంజయ్ దత్ కామెంట్స్...
Alia Bhatt Ranabir Kapoor Wedding: బాలీవుడ్ కాబోయే జంట అలియా-రణబీర్‌లను ఉద్దేశించి నటుడు సంజయ్ దత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తర్వాత త్వరగా పిల్లలను కనాలని రణబీర్‌కు సూచించాడు.
Alia Bhatt Ranabir Kapoor Wedding: బాలీవుడ్ లవ్ కపుల్ అలియా భట్-రణబీర్ కపూర్ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న ఈ జంట పెళ్లి జరగనుంది. అయితే పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనే దానిపై అటు రణబీర్ గానీ, ఇటు అలియా గానీ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. దీంతో పెళ్లి తేదీపై కాస్త గందరగోళం నెలకొంది. కొన్ని మీడియా రిపోర్ట్స్‌లో అలియా భట్-రణబీర్ కపూర్ పెళ్లి ఏప్రిల్ 14 అని పేర్కొనగా.. మరికొన్ని మీడియా రిపోర్ట్స్‌లో ఏప్రిల్ 15 అని పేర్కొన్నారు. పెళ్లి తేదీ పక్కనపెడితే ఈ జంట వెడ్డింగ్ కోసం బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అలియా-రణబీర్ వెడ్డింగ్‌పై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'రణబీర్ పెళ్లి చేసుకోబోతున్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అలియా భట్ నా కళ్ల ముందే పెరిగింది. పెళ్లి అనేది ఒకరి పట్ల మరొకరి కమిట్‌మెంట్. దానికి కట్టుబడి ఉండాలి. చేతిలో చేయి వేసి సంతోషంగా కలిసి ముందుకు సాగాలి. రణబీర్ త్వరగా పిల్లలను కనాలి. సంతోషంగా ఉండాలి.' అని సంజయ్ దత్ రణబీర్‌కు సలహా ఇచ్చారు. ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ దత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సంజయ్ దత్-రణబీర్ కపూర్ మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. సంజయ్ దత్ బయోపిక్ 'సంజు'లో రణబీర్ సంజయ్ పాత్రను పోషించి మెప్పించాడు. రణబీర్‌తో ఉన్న చనువు కారణంగానే సంజయ్ దత్ తన తాజా ఇంటర్వ్యూలో.. పెళ్లి తర్వాత త్వరగా పిల్లలను కనాలని అతనికి సూచించాడు. అయితే రణబీర్ పెళ్లికి మాత్రం సంజయ్ దత్‌కు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. కేవలం 28 మంది సమక్షంలో అలియా-రణబీర్ పెళ్లి జరగనున్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, హీరోయిన్ దీపికా పదుకొణే, దర్శక నిర్మాత కరణ్ జోహార్ పెళ్లి ఆహ్వానం అందినవారిలో ఉన్నారు.
Also Read: Flipkart Sale: iPhone 13 Miniపై ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపు.. ఆఫర్ ఇంకొక్క రోజు మాత్రమే!
Also Read:Breast Cancer: క్యాన్సర్ డేంజర్ బెల్స్... తెలంగాణలో పెరుగుతున్న కేసులు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook