Breast Cancer: క్యాన్సర్ డేంజర్ బెల్స్... తెలంగాణలో పెరుగుతున్న కేసులు...

Cancer Cases in Telangana: తెలంగాణలో క్యాన్సర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 02:54 PM IST
  • తెలంగాణలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
  • ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో వెల్లడి
  • ఏ జిల్లాలో ఎక్కువ కేసులు ఉన్నాయంటే...
Breast Cancer: క్యాన్సర్ డేంజర్ బెల్స్... తెలంగాణలో పెరుగుతున్న కేసులు...

Cancer Cases in Telangana: తెలంగాణలో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరిగినట్లు నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCD) స్క్రీనింగ్‌లో వెల్లడైంది. అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లాలో 167 రొమ్ము క్యాన్సర్ కేసులు ఉండగా.. 166 కేసులతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆ తర్వాతి స్థానంలో ఉంది.

రాష్ట్రంలో కొత్తగా మొత్తం 6095 క్యాన్సర్ కేసులను గుర్తించగా... అందులో 1997 రొమ్ము క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి. ఖమ్మంలో అత్యధికంగా 150 ఓరల్ క్యాన్సర్ కేసులు ఉండగా కరీంనగర్‌లో 106, జగిత్యాలలో 81 కేసులు ఉన్నాయి. ఓవరాల్‌గా రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల్లో కరీంనగర్ 459 కేసులతో టాప్‌లో ఉంది. నిర్మల్‌లో 360, సిరిసిల్లలో 357, పెద్దపల్లిలో 317, సంగారెడ్డిలో 297, యాదాద్రిలో 283 కేసులు ఉన్నాయి. 

రాష్ట్రంలో రొమ్ము క్యాన్సర్ కేసుల పెరుగుదలకు కారణాలు తెలిపే పరిశోధనలేవీ ఇంతవరకూ జరగలేదు. మారుతున్న జీవన శైలి రొమ్ము క్యాన్సర్ కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమై ఉండొచ్చునని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒబెసిటీ సమస్య కూడా క్యాన్సర్‌కు దారితీయవచ్చునని అంటున్నారు. ముఖ్యంగా హార్మోన్ థెరపీ చికిత్స తీసుకున్న మహిళ్లలో, 30 ఏళ్ల తర్వాత పిల్లలను కనే మహిళల్లో క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఇక ఓరల్ క్యాన్సర్‌కు పొగాకు ప్రధాన కారణమని చెబుతున్నారు. 

క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించగలిగితే దాన్ని నయం చేయవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో ఎన్‌సీడీ స్క్రీనింగ్ జరుగుతోంది. ఈ స్క్రీనింగ్ పూర్తయితే తెలంగాణలో క్యాన్సర్ కేసులపై మరింత స్పష్టత రావొచ్చు. ప్రస్తుతం చెబుతున్న క్యాన్సర్ కేసుల సంఖ్య మరింత పెరగవచ్చు. 

Also Read: Bhuvneshwar Kumar: భువనేశ్వర్‌ కుమార్‌ ఖాతాలో చెత్త రికార్డు.. లీగ్ చరిత్రలోనే..!

Also Read: Stampede in Tirumala: తిరుమలలో ఉద్రిక్త పరిస్థితులు.. తొక్కిసలాటలో భక్తులకు గాయాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News