Alia Bhatt: అంబానీ వేడుకల్లో అలియా స్పెషల్ అట్రాక్షన్..160 యేళ్ళ క్రితం నాటి చీర ధరించి..!
Alia Bhatt Saree: అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి వేడుకలలో అలియా భట్ ..160 సంవత్సరాల క్రితం నాటి ఆశావలి చీర ధరించి.. అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చీర గురించి తెలిసి సోషల్ మీడియాలో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. మరి ఈ చీర ప్రత్యేకత ఏమిటో ఒకసారి చూద్దాం..
Alia Bhatt at Ambani Wedding: అంబానీ ఇంట వేడుకలు అంబరాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ విదేశాల నుండి అత్యంత ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నారు. బాలీవుడ్ కు చెందిన పలువురు జంటలు ఈ వేడుకలలో సందడి చేయగా.. సౌత్ నుంచి కూడా చాలామంది కుటుంబ సమేతంగా ఈ వేడుకలలో సందడి చేస్తున్నారు. ఇటీవలే సౌత్ నుంచి నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్, రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన, మహేష్ బాబు తన భార్య నమ్రత, కూతురు సితారతో కూడా సందడి చేశారు. అలాగే సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ వేడుకకు హాజరయ్యి తన స్టెప్పులతో అందరిని ఆశ్చర్యపరిచారు.
ఇకపోతే ఈ వేడుకలలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అందరూ తన గురించే మాట్లాడుకునేలా చేసింది బాలీవుడ్ నాచురల్ బ్యూటీ అలియా భట్. అలియా ఎప్పుడు కూడా కాస్త డిఫరెంట్ గానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఏకంగా 160 సంవత్సరాల క్రితం నాటి ఆశావళి చీర ధరించి.. అందరి దృష్టిని తన వైపు ఆకర్షించడమే కాదు ఆమె కట్టుకున్న చీర గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో పాల్గొన్న అలియా భట్.. 160 సంవత్సరాల క్రితం గుజరాత్ లో నేసిన ఆశావళి చీర అన్న కట్టుకుంది.. దాని ప్రత్యేకతలు ఏమిటంటే 99% స్వచ్ఛమైన వెండి, 6 గ్రాముల బంగారం నిజమైన జరీ అంచుతో స్వచ్ఛమైన పట్టుతో ఆ చీరను నేశారు. డిజైనర్ మనీష్ మల్హోత్రా కలెక్షన్స్ కు చెందిన ఈ చీర ఇప్పుడు దాని వయసుతో అందరిని ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం ఈ చీర ఆలియా ఒంటిపై ధగధగలాడిపోతూ.. మగవలు కూడా ఈ చీర గురించి చర్చించుకునేలా చేస్తోంది. ఇకపోతే సాంప్రదాయాలు ఫ్యాషన్ కి ఎప్పుడు అతీతం కాదు అని నిరూపించిన ఈమె.. అందులో భాగంగానే ఈ అత్యంత పురాతనమైన చీరకు.. మోడ్రన్ టచ్ అందిస్తూ స్ట్రాప్ లెస్ బస్టియర్ బ్లౌజ్ ధరించింది. ఇక దీని ధర అక్షరాలా రూ.3 కోట్ల పై మాటే.. ఏదేమైనా ప్రస్తుతం అలియా ధరించిన చీర అంబానీ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read: Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!
Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి