Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన సినిమాలంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. కానీ గత కొన్నేళ్లుగా తన జానర్‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ సక్సెస్‌లు అందుకుంటున్నాడు. ఇపుడు ఆయన మార్క్ కామెడీ సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. అంతేకాదు ఈ సినిమా 2 గంటల 14 నిమిషాలు ఉంది. అంతేకాదు ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ హిల్లేరియస్ కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను నవ్వించడం పక్కా అని సెన్సార్ వాళ్ల ఇన్‌సైడ్ టాక్. అంతేకాదు ఈ సినిమా ఈ సమ్మర్‌ హిట్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లరి నరేష్ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. సుడిగాడు తర్వాత ఈ రేంజ్ కామెడీ బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత 'నాంది' అంటూ సీరియస్ పాత్రతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబు 'మహర్షి' సినిమాలో మంచి పాత్రతో పలకరించాడు. అటు నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగ' సినిమాలో తన పాత్రలో ఒదిగిపోయాడు. మొత్తంగా చాలా కాలం తర్వాత తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్‌తో రాబోతున్నాడు అల్లరి నరేష్.   


'ఆ ఒక్కటి అడక్కు' మూవీని చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మించారు. మల్లీ అంకం దర్శకత్వం వహించారు. గోపీ సుందర్‌ సంగీతం అందించారు. నరేశ్‌ సరసన ఫరియా అబ్దుల్లా జోడిగా నటించింది.  పెళ్లి అవడం లేదనే నేటితరం యువత కథను ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లి కాని బ్రహ్మచారులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఈ కథాంశంతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.ఈ సినిమాను మే 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాతో అల్లరి నరేష్ తన మార్క్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.


Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి