Naandi movie: తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్. ఇటీవలి కాలంలో సరైన బ్రేక్ లేక నిరాశకు గురైన అల్లరి నరేష్‌కు నాంది కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. సుదీర్ఘ విరామం అనంతరం అల్లరి నరేశ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్( Tollywood )కామెడీ హీరోల్లో ముందుగా గుర్తొచ్చేది అల్లరి నరేశ్ ( Allari naresh ). ప్రముఖ దర్శక నిర్మాత దివంగత ఈవీవీ ( EVV )వారసుడిగా తెరంగేట్రం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదటి నుంచే హాస్య సినిమాల్లో ప్రదానంగా చేస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జయాపజయాల్ని ఏ మాత్రం లెక్క చేయకుండా సినిమాలు చేసుకుంటూ పోయాడు. అందుకే ఇప్పటి వరకూ 50 కు పైగా సినిమాలు చేయగలిగాడు. కొన్ని హిట్ అయితే మరి కొన్ని ఫట్ అన్నాయి. అయితే చాలాకాలం నుంచి సరైన్ బ్రేకప్ లేక నిరాశకు లోనవుతున్నాడు. సరైన సినిమా అవకాశాలు కూడా లేవనే చెప్పాలి. ఈ నేపధ్యంలో ఇటీవల అంటే ఫిబ్రవరి 19న విడుదలైన నాంది సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అల్లరి నరేశ్‌కు ఆనందాన్ని తెచ్చిపెట్టింది. నాంది అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా కధతో ముందుకాచ్చాడు. సినిమా హిట్‌టాక్ రావడంతో నరేశ్ ఊపిరి పీల్చుకున్నాడు.


కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన సినిమా నాంది. చాలా అంచనాలతో విడుదలైన సినిమా అద్భుతమైన స్పందన అందుకుంటోంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. బుక్ మై షో యాప్‌లో 93 శాతం లైక్స్ సాధించిన రికార్డు దక్కించుకుంది. ఇటీవలి కాలంలో ఇంతగా ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమా లేదు. అల్లరి నరేశ్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన నాంది సినిమాను సతీష్ వేగేశ్న నిర్మించగా..శ్రీచరణఅ పాకాల సంగీతం అందించారు. కోలీవుడ్ ( Kollywood )హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషించింది నాంది సినిమాలో. తొలిరోజు నుంచే మంచి కలెక్షన్లు సాధిస్తున్న సినిమా త్వరలో బ్రేక్ ఈవెన్ దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విడుదలైన రోజే 50 లక్షల వరకూ షేర్ రాబట్టింది నాంది సినిమా ( Naandi movie ).


Also read: Drishyam 2: దృశ్యం 2 రీమేక్ కోసం నెటిజన్ల డిమాండ్..రీమేక్ వెంకీతో కాదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook