Allu Arjun New Look : కొత్త లుక్కులో అల్లు అర్జున్.. పుష్ప రాజ్ ఇలా కనిపిస్తాడా?.. ఫన్నీ మీమ్స్
Allu Arjun New Look అల్లు అర్జున్ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బన్నీ లుక్ మీద ఫన్నీ మీమ్స్ వస్తున్నాయి. పుష్ప రెండో పార్ట్‌లో బన్నీ ఇలాంటి లుక్, హెయిర్ స్టైల్‌తో కనిపిస్తాడా? అని అంతా అనుకుంటున్నారు.
Allu Arjun New Look అల్లు అర్జున్ తాజాగా కొత్త లుక్‌లో కనిపించి షాక్ ఇచ్చాడు. బన్నీ వేసుకున్న షర్ట్, బన్నీ హెయిర్ స్టైల్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బన్నీ కొత్త హెయిర్ స్టైల్, ఆ రంగు చూసి అంతా ఆశ్చర్యపోతోన్నారు. కొంపదీసి పుష్ప రాజ్ ఈ లుక్కులోకి మారిపోతాడా? ఏంటి? అని అనుకుంటున్నారు. బన్నీ కొత్త లుక్ మీద ఫన్నీ మీమ్స్ కూడా పడుతున్నాయి.
అసలే బన్నీ స్టైలింగ్, ఫోటో షూట్ల మీద నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ జరుగుతుంది. ట్విట్టర్, ఇన్ స్టాలో బన్నీ క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బన్నీకి సంబంధించిన ఏ విషయం అయినా కూడా క్షణాల్లో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుంటుంది. బన్నీ తాజా లుక్ సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది సినిమా కోసమా? లేదా క్యాజువల్‌గా లుక్‌ను మార్చాడా? అన్నది తెలియడం లేదు.
[[{"fid":"267102","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
బన్నీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఏమీ ఉండటం లేదు. బన్నీ వేస్తోన్న ట్వీట్లు సైతం ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, ఆ విషయం మీద బన్నీ ఆలస్యంగా స్పందించడం, ఆ ట్వీట్‌లోనూ రామ్ చరణ్‌ను ఒకలా.. ఎన్టీఆర్‌ను ఇంకోలా పొగిడేశాడు. తెలుగు ప్రైడ్ అంటూ ఎన్టీఆర్‌ను పొగడటంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.
బన్నీ ప్రస్తుతం సుకుమార్‌తో సినిమాను పూర్తి చేసిన తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను హిందీ ప్రొడక్షన్ కంపెనీలో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అందుకే టీ సిరీస్‌తో సినిమా చేయబోతోన్నట్టుగా తెలిపాడు. సందీప్ రెడ్డి వంగా, టీ సిరీస్, బన్నీ కలిసి ఓ సినిమాను చేయబోతోన్నారు. కానీ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. అసలు కథ ఉందా? లేదా? అన్నది తెలియడం లేదు.
Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook