Allu Arjun: బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్ `పుష్ప` మూవీకి అరుదైన గౌరవం..
Allu Arjun - Pushpa 1 Special Screening: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరెక్కిన మూవీ `పుష్ప 1 .. ది రైస్`. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది. తాజాగా ఈ సినిమాకు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన గౌరవం దక్కించుకుంది.
Allu Arjun - Pushpa 1 Special Screening: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం 'పుష్ప 1. రష్మిచ మందన్న హీరోయిన్‌గా నటించింది. దేవీశ్రీ ప్రసాద్ అద్బుతమైన సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్ తొలిసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. టాలీవుడ్ నుంచి నేషనల్ అవార్డు అందుకున్న ఫస్ట్ హీరోగా ఐకాన్ స్టార్ రికార్డులకు ఎక్కారు. అంతేకాదు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.
తాజాగా అల్లు అర్జున్ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మన దేశపు తరుపున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్నాడు. తాజాగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పుష్ప ది రైజ్ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సినిమా చూసిన వాళ్లు చిత్ర యూనిట్ ను అభినందనలతో ముంచెత్తారు. అంతేకాదు నిర్వాహకులు అతిథులను ప్రత్యేక సిజిల్‌తో సత్కరించారు.
ప్రజెంట్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరగుతోంది. ఈ యేడాది ఆగష్టు 15న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ తెలుగులో కంటే హిందీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాపై తెలుగులో కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ బజ్ ఉంది. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్.. పుష్ప కంటే అద్భుతమైన సంగీతం అందించనున్నారట. పుష్ప మాదిరే పుష్ప 2 రూల్ మూవీలోని పాటలు కూడా చార్ట్ బస్టర్స్‌గా నిలిచే అవకాశాలున్నాయి. ఇక సుకుమార్ మూవీ తర్వాత అల్లు అర్జున్.. వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం.
Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే
Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook