Pushpa The Rule Aduio Rights అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రాబోతోన్న పుష్ప ది రూల్ సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వేర్ ఈజ్ పుష్ప, కాళీ అవతారంలో ఉన్న పోస్టర్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సుకుమార్ దేవీ శ్రీ ప్రసాద్ బన్నీ అంటే ఆడియో ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పుష్ప ఆ రేంజ్‌లో హిట్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా పాటలే అని అందరికీ తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప పాటలు వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండో పార్ట్ పాటల మీద కూడా భారీ అంచనాలున్నాయి. అయితే పుష్ప ది రూల్ కోసం దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయేలా ట్యూన్లు రెడీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈలోపే ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుష్ప పాటలు అన్ని భాషల్లో కలిపి ఆడియో రైట్స్‌ను టీ సిరీస్ సంస్థ ఒప్పందం చేసుకుందట. అయితే ఇంత వరకు ఈ రేంజ్‌లో అమ్ముడుపోలేదట.


ఆర్ఆర్ఆర్ సినిమాకు హయ్యస్ట్‌గా 26 కోట్లకు అమ్ముడుపోయిందట. పొన్నియిన్ సెల్వన్‌ 24 కోట్లకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది. అయితే ఇవే హయ్యస్ట్‌ అనుకుంటే.. పుష్ప ది రూల్ మాత్రం వీటికి రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. 65 కోట్లకు ఆడియో రైట్స్‌ అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Also Read:  Akhil Agent : నాగ చైతన్య కంటే దారుణంగా అఖిల్.. ఇక సమంత అయితే అంతకు మించి


ఆడియోకు అన్ని కోట్లు ఎలా పెడతారు? బన్నీ పీఆర్ టీం ఇలా ఎందుకు ప్రచారాలు చేస్తోంది.. అసలు ఆడియోతో ఇన్ని కోట్లు ఎలా వస్తాయి.. వాళ్లు ఎందుకు పెడతారు.. అంటూ ఇలా నానా రకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా డబుల్ రేంజ్ రేట్‌కు అమ్ముడుపోవడంతో బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook