Mangalavaram Pre-release event: ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం మంగళవారం. మరోసారి ఈ సినిమాలో పాయల్ రాజు బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించనుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్.. మంగళవారం సినిమా గురించి అలానే పుష్పా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందర అందరికీ దీవాళీ విషెస్ చెప్పి తన స్పీచ్ ని మొదలుపెట్టారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ మాట్లాడుతూ..' నా బలం.. నా ఫ్యాన్స్. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. చాలామంది ఫ్యాన్స్‌కి వాళ్ల హీరో ఇన్స్పిరేషనేమో.. కానీ నాకు మాత్రం నా ఫ్యాన్సే ఇన్స్పిరేషన్. నా అభిమానులను చూశాక నాపై నాకు నమ్మకం కలిగింది. నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీకెప్పుడూ రుణపడి ఉంటాను' అని తెలియజేశారు.


ఆ తరువాత మంగళవారం సినిమా గురించి చెబుతూ..'ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. టీజర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సినిమా టీజర్ నాకు చాలా నచ్చింది. టీజర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. అజయ్ గారు.. నాకు కథ చెప్పినప్పుడు.. ఆయన నాతో చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది. అదేమిటి అంటే సార్ మీరు గర్వించే స్థాయిలో సినిమా తీస్తానని అన్నారు.. ట్రైలర్ చూశాక అది నిజమే అనిపించింది. నాకు RX100 సినిమా అంటే చాలా ఇష్టం. అజయ్ భూపతి గొప్ప  గొప్ప డైరెక్టర్. నేను పుష్ప సినిమా షూటింగ్‌లో ఉండగా.. సుకుమార్ గారు వచ్చి.. ‘మంగళవారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వెళ్తున్నావా? అని అడిగారు. అవును సార్  అని చెప్పాను. అలానే నేను సుకుమార్ గారికి టీజర్ చూపించాను. ఆయన ఏంటయ్యా షాకిచ్చాడు డైరెక్టరూ.. అంత బాగా తీశాడు అని అది కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే.. కొన్ని సినిమాలకు పాజిటివ్ వైబ్ ఉంటుంది.. ఈ సినిమాలో అది ఉంది. పాయల్ కు RX100 ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఈ మంగళవారం కూడా అలాంటి ట్రెండ్ సెట్ చేస్తుంది. ఈ చిత్రంలో చాలా బోల్డ్ ఇష్యూ ఉంటుంది. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి.


ఈ సినిమా నిర్మాతలు స్వాతి, ప్రణవ్‌లు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇది వాళ్ల ఫస్ట్ సినిమా. ఈ సినిమా తీసే ముందు స్వాతి.. నా దగ్గరకు వచ్చి నేను సినిమా తీయాలని అనుకుంటున్నాను అని భయపడుతూ చెప్పింది. నాకు ఈ ఫీల్డ్ సరిగా తెలియదు.. భయంగా ఉంది అని చెప్పింది. నేను తనకి ఒకే మాట చెప్పా.. ఏదైనా చేద్దాం అని అనుకున్నప్పుడు.. దూకేయాలి. బురదలో చేయి పెడితేనే కానీ తెలియదు..మనం చేయగలమా లేదా అని. ముందు దూకెయ్ ఆ తరువాత ఈత నేర్చుకో అని చెప్పాను. తాను చాలా కష్టపడి ఈ సినిమా మన ముందుకు తీసుకొచ్చింది' అని చెప్పకు వచ్చారు.


ఇక ఆ తరువాత తన పుష్ 2 సినిమా విశేషాలు చెబుతూ..'నేను ఇప్పుడు పుష్ప సినిమా షూటింగ్ నుంచి ఇక్కడికి వచ్చాను. నా చేతులకు పారాణీ.. గోళ్ల రంగూ చూస్తున్నారుగా.. పోస్టర్‌లో ఉన్న జాతర ఎపిసోడ్ రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నాం. అయితే ఆ వివరాలు గురించి వేరే ఈవెంట్‌లో మాట్లాడుకోవచ్చు. నాకు నేషనల్ అవార్డ్ వచ్చిన తరువాత నా ఫస్ట్ సినిమా ఈవెంట్ ఇది. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. మంగళవారం చిత్రం శుక్రవారం విడుదల కానుంది ..మీరందరూ చూసి ఆదరించండి.. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. నాకు ఆర్మీ ఉంది.. పుష్ప చూసి తగ్గేదేలే.. తగ్గేదేలే అంటారు.. కానీ పుష్ప 2 చూస్తే అస్సలు తగ్గేదేలే అంటారు’ అంటూ ఊర మాస్ స్పీచ్ ఇచ్చారు బన్నీ.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook