Allu Arjun on Aha: తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫినాలేకి అల్లు అర్జున్..అందరి కళ్ళూ వెయిటింగ్!
Allu Arjun at Telugu Indian Idol 2 grand finale: ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయి ప్రస్తుతం రెండవ సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రేజీ రియాలిటీ షో రెండవ సీజన్ ముగింపు దశకు చేరుకున్న క్రమంలో గట్టిగానే ప్లాన్ చేసింది టీం.
Allu Arjun to grace the Telugu Indian Idol 2 grand finale: మొట్టమొదటి తెలుగు ఓటీటీ ప్లాట్ఫారంగా ఆహా వీడియో యాప్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. లాంచ్ అవ్వడమే కాదు దాదాపు మిగతా ఓటీటీలన్నింటికీ పోటీ ఇచ్చే విధంగా కేవలం సినిమాలు వెబ్ సిరీస్ లు మాత్రమే కాదు రియాలిటీ షోలు కూడా నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది.
మరీ ముఖ్యంగా ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటికే మొదటి సీజన్ విజయవంతంగా పూర్తికాగా ప్రస్తుతం రెండవ సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రేజీ రియాలిటీ షో ముగింపు దశకు చేరుకున్న క్రమంలో త్వరలోనే ఫినాలే జరగబోతోంది. మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ రెండవ సీజన్ ని కూడా అంతే గ్రాండ్ గా ప్లాన్ చేసింది ఆహా టీం. ఇక ఈ సెన్సేషనల్ మ్యూజిక్ ప్రోగ్రాం కి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో పాటు సింగర్లు గీతా మాధురి, కార్తీక్, హేమచంద్ర జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?
ఇక తాజాగా ఈ ఫినాలే కి సంబంధించిన షూట్ జరగగా దానికి ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని వీడియోలు రిలీజ్ అయ్యాయి. తెలుగు ఇండియన్ టు అసాధారణ టాలెంటెడ్ సింగర్స్ కి వేదికైందని ఈవెంట్ లో భాగమైనందుకు ఆనందంగా ఉందని అందరికీ బెస్ట్ విషెస్ చెబుతూ అల్లు అర్జున్ చేసిన కామెంట్ల వీడియో ఒకటి వైరల్ అవుతుంది. నిజానికి సుమారు పదివేల మందికి పైగా తెలుగు సింగర్స్ తెలుగు ఇండియన్ అడల్ట్ 2 ఆడిషన్స్ లో పాల్గొన్నారు.
అలా పదివేల మంది నుంచి అత్యంత ప్రతిభావంతులను మాత్రమే ఎంపిక చేసి చివరి వరకు తీసుకొచ్చారు. ఇక దశలవారీగా జరిగిన పోటీలో దాదాపు 5 గురు మాత్రమే ఫైనల్స్ కు వెళ్లారు. వారిలో న్యూ జెర్సీకి చెందిన శృతి నండూరి, హైదరాబాదుకు చెందిన జయరాం, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియ, హైదరాబాదుకు చెందిన కార్తికేయ విశాఖపట్నం చెందిన సౌజన్య భాగవతుల ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే ఫైనల్స్ కు వెళ్ళబోతున్నారు.
Also Read: Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK