Allu Arjun Viral Tweet: పుష్ప రెండో భాగం.. డిసెంబర్ 4న థియేటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదల తేదీ డిసెంబర్ 5 అయినప్పటికీ.. డిసెంబర్ 4న ఎన్నో థియేటర్స్ లో ప్రీమియర్స్ వేశారు. ఇక ఈ ప్రీమియర్స్ కు ఎంతోమంది జనం పరుగులు తీశారు. ముఖ్యంగా హైదరాబాదులో సంధ్య థియేటర్ కి.. అల్లు అర్జున్, అతని ఫ్యామిలీ రావడంతో.. అక్కడ జరిగిన ప్రీమియర్ షో కి ప్రజలను కంట్రోల్ చేయడం పోలీసుల తరం కూడా కాలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సంఘటనలోనే.. తొక్కిసలాటకు గురై.. రేవతి అనే మహిళ మృతి చెందగా.. ప్రస్తుతం ఆమె కుమారుడు హాస్పిటల్ లో.. క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు. ఈ కేసులో భాగంగానే.. ఈ మధ్యనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే కొన్ని గంటల్లోనే ఆయన ఇన్ టర్మ్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఈ సంఘటనలో భాగంగా.. కొంతమంది సోషల్ మీడియాలో అల్లు అర్జున్ నిందిస్తున్నారు. అల్లు అర్జున్ అక్కడికి పోవడం వల్లే ఇలా జరిగింది అని.. అంతేకాకుండా బాధితుల కుటుంబానికి అల్లు అర్జున్ కేవలం 25 లక్షల డబ్బు ప్రకటించడం.. అసలు ఏమీ బాగాలేదు అనేది ఎంతోమంది వాదన. 


ఇక ప్రస్తుతం ఆ అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది అని తెలియడంతో.. అల్లు అర్జున్ ఇప్పటికీ కూడా హాస్పిటల్కు పోలేదు అని.. ఆయన ప్రవర్తన మార్చుకోవాలి అంటూ ఎంతోమంది తీవ్రంగా సోషల్ మీడియాలో మంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అసలు ఎందుకు హాస్పిటల్ కి వెళ్ళలేకపోయాడు అనే వివరణ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఇచ్చారు. 


“శ్రీ తేజ పరిస్థితి గురించి నేను చాలా చింతిస్తున్నాను. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న లీగల్ ప్రొసీడింగ్స్ వల్ల.. నన్ను అక్కడికి వెళ్ళద్దు అని వారు అద్వైజ్ చేయడం వల్ల.. నేను వెళ్లి హాస్పిటల్లో శ్రీతేజాన్ని చూడలేకున్నాను. కానీ నా ప్రార్ధనలు..ఎల్లప్పుడూ ఆ అబ్బాయితో ఉంటాయి. అతనికి సంబంధించిన హాస్పిటల్ అవసరాలు, ఫ్యామిలీ అవసరాలు నేను చూసుకుంటాను. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తప్పకుండా వాళ్ళని వెళ్లి నేను కలుస్తాను,” అని తెలియజేశారు. 


Also Read: Hyderabad Real Estate: సొంతింటి కలను తీరుస్తున్న గండిమైసమ్మ..ఇల్లు కొనే ప్లాన్‎లో ఉంటే ఈ ఏరియాలో చౌక ధరలకే అందుబాటులో  


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.