అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం పోస్టర్ ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే ( Allu Arjun's next movie). బన్నీ తన 21వ చిత్రాన్ని ప్రకటించడంతో స్టైలిష్ స్టార్ అభిమానుల నుంచి భారీ స్పందన కనిపించింది. ప్రస్తుతం కొరటాల శివ చేస్తున్న ఆచార్య, బన్నీ చేస్తున్న పుష్ప సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మల్టీలాంగ్వెజెస్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమై విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. కొరటాల శివ ఈ చిత్రాన్ని మొదట ఎన్టీఆర్‌తో ( Tarak) చేయాలనుకున్నాడట. కాని తారక్‌కి ఆ కథ నచ్చకనో లేక మరేదైనా కారణం వల్లో తెలియదు కాని, ఆ కథ ఎన్టీఆర్ నుండి బన్నీ చేతికి వెళ్లిందనే టాక్ వినిపిస్తోంది. Also read: Allu Arjun21: అల్లు అర్జున్, కొరటాల శివ... క్రేజీ కాంబినేషన్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బన్నీ చాలా కాలంగా కొరటాల శివతో ( Koratala Siva) కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు అతనికి ఈ చిత్రంతో ఆ అవకాశం దక్కింది. ఈ చిత్రంలో బన్నీ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. Also read: Mahesh Babu: మహేష్ బాబు హీరోయిజంకు 21 ఏళ్లు


అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న బన్నీ 20వ సినిమా పుష్ప ఫస్ట్ లుక్, టైటిల్ లోగో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రశ్మిక మందన్న జంటగా నటిస్తుండగ సుకుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ, చిరంజీవితో కలిసి ఆచార్య మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. Also read: Twitter hacking: ట్విటర్ హ్యాకింగ్ ఎలా జరిగిందంటే..