Allu Arjun21: అల్లు అర్జున్, కొరటాల శివ... క్రేజీ కాంబినేషన్

అల వైకుంఠపురములో ( Ala Vaikuntapurramu lo ) సినిమాతో 2020కు శుభ ఆరంభం ఇచ్చాడు అల్లు అర్జున్ ( Allu Arjun ). ఈ మూవీ 150 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. దాంతో పాటు అల వైకుంఠపురములో మూవీ హిందీలో కూడా తెరకెక్కనుంది అని సమాచారం. అదే సమయంలో బన్నీ తన 21 మూవీ #AA21 గురించి కీలక ప్రకటన చేశాడు

Last Updated : Jul 31, 2020, 03:41 PM IST
Allu Arjun21: అల్లు అర్జున్, కొరటాల శివ... క్రేజీ కాంబినేషన్

అల వైకుంఠపురములో ( Ala Vaikuntapurramu lo ) సినిమాతో 2020కు శుభ ఆరంభం ఇచ్చాడు అల్లు అర్జున్ ( Allu Arjun ). ఈ మూవీ 150 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. దాంతో పాటు అల వైకుంఠపురములో మూవీ హిందీలో కూడా తెరకెక్కనుంది అని సమాచారం. అదే సమయంలో బన్నీ తన 21 మూవీ #AA21 గురించి కీలక ప్రకటన చేశాడు. ఈ సినిమాను చాలా మంది త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ), లేదా సుకుమార్ తో తెరకెక్కిస్తారేమో అని అభిమానులు అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా కొరటాల శివతో ఈ సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు బన్నీ.

Read This Story Also: Ala vaikunthapurramuloo: అల వైకుంఠపురములో హిందీ హీరో ఎవరో తెలుసా?

అల్లు అర్జున్ ప్రస్తుతం సుమార్ ( Sukumar ) తో పుష్ప ( Pushpa Movie ) అనే సినిమా చేస్తున్నాడు. దీని తరువాత కొరటాల శివతో మూవీ ఉంటుందని సమాచారం. ఈ మూవీని  పుష్ప మూవీలా ప్యాన్ ఇండియా సినిమాలో తెరకెక్కించనున్నారని.. 2022లో విడుదల చేయనున్నట్టు సమాచారం. కొరటాల శివ ( Koratala Siva ) ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ( Chiranjeevi ) ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆగస్టులో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది అని సమాచారం. ఆచార్య ( Acharya Movie ) ప్యాకప్ అయ్యాక అల్లు అర్జున్, కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. తరువాత వేణు శ్రీరామ్ ( Icon Movie Venu Sriram ) తో ఐకాన్ అనే సినిమా చేయనున్నాడు బన్నీ.

Read This Story Also: Acharya Firstlook: ఆచార్య ఫస్ట్ లుక్ విడుదల తేది ఫిక్స్ ?

Trending News