Pushpa Trailer launching date: పుష్ప ట్రైలర్ కోసం వేచిచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. డిసెంబర్ 6న సాయంత్రం 6:03 గంటలకు విడుదల కావాల్సి ఉన్న పుష్ప ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. అల్లు అర్జున్ అభిమానులతో పాటు సాధారణ ఆడియెన్స్‌ని కూడా ఇదిగో వచ్చేస్తోంది, అదిగో వచ్చేస్తోంది అంటూ ఊరించిన మైత్రి మూవీ మేకర్స్.. చివరి నిమిషంలో పుష్ప ట్రైలర్‌ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కొన్ని అనుకోని సాంకేతిక కారణాలరీత్యా పుష్ప ట్రైలర్‌ని వాయిదా వేస్తున్నట్టు పుష్ప మేకర్స్ ట్విటర్ ద్వారా తెలిపారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : NTR - Mahesh Babu: మహేష్ బయ్యా.. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది: Jr Ntr to Mahesh Babu


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన రష్మిక మంధన జంటగా నటించిన పుష్ప మూవీలో మళయాళం నటుడు ఫహద్ ఫాజిల్ మరో కీలక పాత్ర పోషించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, మళయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.


ఏదేమైనా పుష్ప మూవీ ట్రైలర్ లాంచింగ్ కోసం ఎదురుచూసిన అభిమానులు మాత్రం ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. అల్లు అర్జున్‌పై (Allu Arjun's requet to Pushpa team), ఆయన చిత్రాలపై వారికి ఉన్న అభిమానం అలాంటిది మరి. త్వరలోనే పుష్ప ట్రైలర్ కొత్త లాంచింగ్ డేట్ డీటేల్స్ (Pushpa trailer launching new date) వెల్లడించే అవకాశం ఉంది.


Also read : Unstoppable latest episode: విలన్‌గా చేయడానికి నేను రెడీ.. బట్ వన్ కండిషన్ అంటున్న NBK


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook