Allu Ayaan Ghani Anthem: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌... తనదైన స్టైల్‌, మేనరిజమ్స్‌తో ఎంతోమంది అభిమానగణాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు ఆయన సతీమణి స్నేహారెడ్డి కూడా తన ఫ్యాషనబుల్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. వీరితో పాటు ఈ దంపతుల ముద్దుల సంతానం అల్లు అర్హ, అల్లు అయాన్‌కు కూడా సోషల్‌ మీడియాలో బోలెడు క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా ‘శాకుంతలం’ సినిమాతో వెండితెరపైకి అడుగుపెడుతున్న అల్లు అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు అల్లు అయాన్‌ వర్కవుట్‌ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ కొణిదెల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. సాయి కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘గని…కనివినీ ఎరుగని’ అంటూ ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్‌ సాంగ్‌ మెగా అభిమానులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే.


ఇప్పుడా పాటను రీక్రియేషన్‌ చేశాడు అల్లు అయాన్. వరుణ్‌ తరహాలో భారీ వర్కవుట్లు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను గీతా ఆర్ట్స్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అయాన్‌ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. 


Also Read: Akhanda Title Song: ‘అఖండ’ టైటిల్ సాంగ్ వచ్చేసింది.. అఘెరా లుక్ లో బాలయ్య 


Also Read: Vicky Katrina Roka: పెళ్లికి సిద్ధమైన విక్కీకౌశల్ – కత్రినా.. దీపావళి రోజున జరిగిన రోకా ఫంక్షన్?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook