Hero Allu Arjun funny comments on GrandFather Allu Ramalingaiah: చిన్న తనంలో తాను ఎందుకూ పనికిరానని తన తాతయ్య అనుకున్నాడని 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ తెలిపాడు. 16 ఏళ్లు వచ్చేవరకూ తాతయ్య-నానమ్మలతోనే ఉన్నానని,  తాతయ్య చనిపోయాక రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్‌ డబ్బు తనకు వచ్చిందని అయన చెప్పాడు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకొని.. ‘అల్లు రామలింగయ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఐకాన్ స్టార్ తన తాతయ్య జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ‘అల్లు రామలింగయ్య’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ... 'ఈ వేడుక జరగడం చాలా సంతోషంగా ఉంది. నేను 16 ఏళ్ల వరకు తాతయ్య, నానమ్మలతోనే ఉన్నా. తాతయ్య చనిపోయాక.. నాకు మాత్రమే రూ. 10 లక్షల ఇన్స్యూరెన్స్‌ డబ్బు వచ్చింది. తాతయ్య ఎందుకిలా చేశారని చాలా ఆలోచించా. బీమా కట్టిన సంవత్సరాన్ని చూస్తే అసలు విషయం అర్ధమైంది' అని అన్నాడు.



'తాతయ్య డబ్బు జమ చేయడం మొదలు పెట్టిన సమయంలో నేను నాలుగో క్లాస్ చదువుతున్నా. వీడు జీవితంలో ఎందుకూ పనికిరాడని తాతయ్య ఫిక్స్ అయి అలా చేశారు. 18 ఏళ్ల వయసు వచ్చాక ఈ పది లక్షలు ఏదోలా ఉపయోగపడతాయని భావించి.. డబ్బు నా కోసమే జమ చేశారు. అప్పుడు తాతయ్య దృష్టిలో ఎందుకూ పనికి రాని నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. అందుకు చాలా ఆసంతోషిస్తున్నా. తాతయ్య నా ఎదుగుదలను చూసి ఉంటే బాగుండేది' అని అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 కోసం సిద్దమయ్యాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. 


Also Read: IND vs SA: సిరాజ్ ఇన్.. పంత్ డౌట్! దక్షిణాఫ్రికాతో తలపడే భారత తుది జట్టు ఇదే


Also Read: నష్టాలను మిగిల్చింది.. పుష్పపై డైరెక్టర్ తేజ కామెంట్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి