Allu Sirish Buddy Trailer: గత కొంతకాలంగా.. సినిమాలకి దూరంగా ఉంటున్న అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ఎట్టకేలకు.. ఒక సినిమాతో త్వరగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సామ్ అంటోన్ దర్శకత్వం వహిస్తున్న.. బడ్డీ అనే సినిమాతో అల్లు శిరీష్ మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్.. చాలా కాలం క్రితం వచ్చింది. ఇన్నాళ్ళకి ఈ సినిమా ట్రైలర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ట్రైలర్ మొదలవడమే సినిమాలో.. కీలక పాత్ర పోషిస్తున్న ఒక టెడ్డీబేర్ ని ఇంట్రడ్యూస్.. చేస్తూ మొదలవుతుంది. 


"అన్యాయాన్ని ఎదిరించే సింహాన్ని.. చిరుతని.. పులిని చూసి ఉంటారు. కానీ టెడ్డీ బేర్ ని చూశారా" అంటూ సాయికుమార్ తన బేస్ వాయిస్ తో టెడ్డీ బేర్ ని.. హైప్ ఇస్తూ పరిచయం చేయడం కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో అల్లు శిరీష్ పైలట్ గా కనిపించనున్నారు. 


బడ్డీ అనే టెడ్డీ బేర్ సహాయం కోసం ఆదిత్య రామ్ (అల్లు శిరీష్) ని అడుగుతాడు. అయితే అసలు ఈ బడ్డీ ఎవరు, ఆదిత్య రామ్ తో బడ్డీకి ఏం పని, బడ్డీ అడిగిన సహాయం ఆదిత్య రామ్ చేస్తాడా? బడ్డీ అడిగిన సహాయం ఏంటి? చివరికి ఏమైంది? అనేది సినిమా కథ అని ట్రైలర్ చూస్తేనే అర్థమయిపోతుంది. 


 



బడ్డీ పాత్రని చాలా బాగా చూపిస్తున్నారు. ముఖ్యంగా తగ్గేదేలే అంటూ టెడ్డీబేర్ అనడం చాలా ఫన్నీగా అనిపించింది. అల్లు శిరీష్, బడ్డీ మధ్య ఉండే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను చాలా బాగా అలరిస్తాయని అనిపిస్తోంది. 


ప్రిష రాజేష్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది అజ్మల్ అమీర్ ఈ సినిమాలో ముఖ్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత కమెడియన్ అలి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 


ఓవర్ ఆల్ గా చిత్ర ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాలి. కేఈ జ్ఞానవెల్.. రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకి హిప్ హాప్ తమీజ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా జూలై 26న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాతో అల్లు శిరీష్ మళ్లీ ఫామ్ లోకి వస్తారో లేదో వేచి చూడాలి. 


Also Read: Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..


Also Read: Sexual Assault: పోర్న్‌ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter