Oke Oka Jeevitham: శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'ఒకే ఒక జీవితం' నుంచి రిపబ్లిక్​ డే సందర్భంగా కొత్త (Sharwanand new Movie) అప్​డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'అమ్మ' లిరికల్​ సాంగ్ (Oke Oka Jeevitham amma song) విడుదలైంది. ఈ పాటను యువ హీరో అక్కినేని అఖిల్​ విడుదల చేశారు. ఈ సందర్భంగా హార్ట్ టచింగ్ సాంగ్ అంటూ అఖిల్ ట్వీట్ (Akhil Akkineni) చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో అక్కినేని అమల (Akhil Akkineni Amala), నాజర్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


'అమ్మ.. వినమ్మా.. నేనానాటి నీలాలి పదాన్నే. ఓహ్​.. ఔనమ్మా.. నెనేనమ్మా.. నువు ఏనాడో కనిపెంచిన స్వరాన్నే..' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ హార్ట్ టచ్చింగ్​గా ఉంది. ఈ పాటకు మరో విషయం ఏమిటంటే.. సిరివెన్నేల సీతారామ శాస్త్రి (Sirivennela Sitaramasastri) ఈ పాటను రచించారు.


సిద్​ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. జకీస్​ బిజోయ్​ సంగీతం అందించారు.



సినిమా గురించి..


ఈ సినిమాలో శర్వానంద్​కు జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఆలీ, వెన్నెల కిశోర్​, ప్రియదర్శి సహా పలువురు నటీనటులు (Oke Oka Jeevitham Cast) ఉన్నారు. ఒకే సారి తెలుగు, తమిళంలో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంది.


వచ్చే నెలలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది. టైం ట్రావెల్ (Time Travel)​ కాన్సెప్ట్​తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్​ అయిన సినిమా ట్రైలర్​ అంచనాలను పెంచేసింది. ఇటీవలి కాలంతో ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే.


ఈ సినిమాకు శ్రీకార్తిక్ దర్శకత్వం వహించారు. తరుణ్​ భాస్కర్ (Tharun Bhascker) డైలాగ్స్ (తెలుగు) అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్​స్ బ్యానర్​పై నిర్మించిన ఈ సినిమాకు ప్రభు ఎస్​ఆర్​ ప్రొడ్యూసర్​.


Also read: Pia Bajpiee Photos: రంగం సినిమా హీరోయిన్ ఇప్పుడెలాగ ఉందో చూశారా?


Also read: Khiladi Full Kicku Song: రవితేజ బర్తే డే సర్ ప్రైజ్.. ఖిలాడి సినిమాలోని ఫుల్ కిక్కు సాంగ్ రిలీజ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook