Anand Devarakonda - Gam Gam Ganesha: 'బేబి' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తోన్న సినిమా 'గం గం గణేషా'. ఉదయ్ శెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈయన కెరీర్‌లో ఫస్ట్ యాక్షన్ మూవీ కావడం విశేషం. తొలిసారి డిఫరెంట్ జానర్‌తో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా మే 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. కొండ అంచున నిలబడి ఉన్న హీరో ఆనంద్ గన్ ఫైర్ చేసినపుడు ఆ గన్‌ నుంచి గులాబి రేకులు వస్తున్నట్టు పోస్టర్‌ డిజైన్ చేశారు. సరికొత్త కంటెంట్‌తో ఈ సమ్మర్‌లో అన్ని వర్గాల ఆడియన్స్‌ను 'గం.. గం..గణేషా'ఎంటర్టైన్ చేయబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా 'బేబి'. లాస్ట్ ఇయర్ రిలీజైన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చింది. అంతేకాదు లాస్ట్ ఇయర్ ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. కేవలం రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 50 కోట్లకు షేర్ (రూ. 100 కోట్ల గ్రాస్) రాబట్టింది. అంతేకాదు నిర్మాతలకు దాదాపు రూ. 40 కోట్ల వరకు థియేట్రికల్‌గా లాభాలను తీసుకొచ్చింది.


Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook