Weight Loss: బరువు తగ్గడానికి సూపర్ డైట్.. అనంత్ అంబానీ అప్పట్లో ఫాలో అయ్యింది ఇదే!
Anant Ambani Diet: అనంత్ అంబానీ ఒక్కసారిగా బరువు తగ్గి 2016 లో అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ఆరోగ్య పరిస్థితుల వల్ల తిరిగి వెంటనే బరువు పెరిగిపోయారు. ఈ క్రమంలో అనంత్ అంబానీ తగ్గడానికి ఫాలో అయిన దాని పైన మాత్రం అప్పట్లో అందరి ఆసక్తి నెలకొంది.
Anant Ambani Weight Loss Diet: అంబానీ ఇంట పెళ్లి వేడుకలు జరిగినప్పటి నుంచి ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న పేరు అనంత్ అంబానీ. అంబానీ కొడుకు అన్న విషయం కంటే కూడా.. చాలామంది అతని శరీరాకృతిపై విమర్శలు కురిపిస్తుంటారు. కానీ అనంత్ అంబానీ ఆరోగ్య పరిస్థితి కారణంగానే బరువు పెరగడం జరిగింది. అయితే కొద్ది సంవత్సరాల క్రితం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ అనంత్ ఎంతో సన్నగా అయిపోయాడు. 2016లో కేవలం 18 నెలలవ్యవధిలో 108 కిలోల బరువు తగ్గాడు.. తిరిగి ఒకటిన్నర సంవత్సరం గ్యాప్ లో మళ్ళీ 100 కిలోలకు పైగా పెరిగిపోయాడు. ఆస్తమాతో బాధపడే అనంత్ స్టెరాయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అతను అలా బరువు పెరిగాడు అన్న విషయం నీతా అంబానీ ఒకసారి స్పష్టం చేశారు.
ఇక ఆ విషయం పక్కన పెడితే అతను 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గడానికి చాలా కఠినమైన డైట్ ఫాలో అయ్యారట. అప్పట్లో ఆ డైట్ తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపించారు. ఇక అనంత్ బరువు తగ్గే విషయంలో వినోద్ చన్నా ఎంతో సహాయం చేశారు. వినోద్ ఒక సెలబ్రిటీ ట్రైనర్.. ఫిట్నెస్ కోచ్ కావడంతో అనంత్ కు సంబంధించి ప్రతిరోజు డైట్ ని ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అతను ఏం తినాలి? ఎప్పుడు తినాలి ?ఎంతసేపు వ్యాయామం చేయాలి? ఇలాంటి అన్ని విషయాల పట్ల వినోద్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. మరి అప్పట్లో అనంత్ అంబానీ కి పెట్టిన ధైర్ నియమాలు ఒకసారి చూద్దాం..
బరువు తగ్గడం కోసం అనంత్ రోజుకు కేవలం 1200 నుంచి 14 మధ్య క్యాలరీ తినేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఎక్కువ శాతం అతను తీసుకునే ఆహారంలో కూరగాయలు, మొలకలు, పప్పు దినుసులు, ½ స్పూన్ నెయ్యి, కాటేజీ చీజ్ మొదలైనవి ఉండేవి. జంక్ ఫుడ్ తినే అలవాటు మాన్పించడం కోసం అతను తీసుకునే డైట్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే వారట. అలాగే ఎక్కువ శాతం ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉండే విధంగా అతని కోసం ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తయారు చేసేవారు. ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకుండా.. చిన్న చిన్న భాగాలుగా విభజించి తీసుకోవడం అనంత్ అలవాటు చేసుకున్నాడు.
డైట్ తో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని కూడా ఫాలో అవుతూ.. తగిన వ్యాయామం చేస్తూ అనంత్ చాలా వరకు బరువు తగ్గారు. అతను రోజుకు 5 నుంచి 6 గంటల పాటు వ్యాయామం చేస్తూ 21 కిలోమీటర్లు నడిచేవారట. ఇప్పుడు మళ్లీ తిరిగి అదే డైట్ ఫాలో అవుతూ పెరిగిన బరువు తగ్గించుకునే పనిలో అనంత్ బిజీగా ఉన్నారని టాక్.
Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్ రిటర్న్ గిఫ్ట్
Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook