Anchor Rashmi fires on Cock fights: కోడి పందాల గురించి యాంకర్ రష్మీ తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. తెలుగులో జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించిన రష్మీ నిజానికి కెరీర్ లో ముందుగా సినీనటిగా ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద జబర్దస్త్ అనే షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క షోలు కూడా చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకునే పనిలో పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మూగజీవాల మీద చాలా ప్రేమ వ్యక్తపరుస్తూ ఉండే రష్మీ అప్పుడప్పుడు మూగజీవాలకు సంబంధించిన కొన్ని పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక డాక్టర్ తాను కోడిపందాలు వేశానని అందులో రెండు పందాలు తాను గెలిచాను అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఫోటోను షేర్ చేసి జనాలు ఈ విషయాల్లో కూడా ఎలా తమ గర్వాన్ని ప్రదర్శిస్తున్నారు చూడండి, ఎవరిని హాని పరచకుండా పండుగ చేసుకోవడం వీరికి రావడం లేదా అంటూ ఒక ట్వీట్ చేసింది. దీంతో గుల్షన్ అనే ఒక తెలుగు నెటిజన్ ఇదే ట్వీట్ జల్లికట్టు మీద వెయ్యి, తమిళనాడు వాళ్ళు వచ్చి చెప్పు తెగేలా కొడతారు, మా తెలుగు వాళ్ళ వల్లే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, మా సంప్రదాయాల మీద ఏడుపు ఏడిస్తే చెప్పుతో కొడతారు అంటూ ట్వీట్ చేశాడు.


దానికి మళ్లీ స్పందించిన రష్మీ ఏ సంప్రదాయం కాళ్లకు కత్తులు కట్టి జంతువులను హానిపరచమని చెప్పింది? ఏ సంప్రదాయం వాటికి మందు పట్టించి కారంతో వాటిని రెచ్చగొట్టమని చెప్పింది? వాటికి హాని జరగనంత వరకు ఏదైనా ఒప్పుకోవచ్చు, ఏదైనా జంతువుకి హాని కలిగితే దాన్ని వెనకేసుకు రాకండి కావాలంటే మీ వాయిస్ జరుగుతున్న తప్పులు మీద పెంచండి అని అతనికి సలహా ఇచ్చింది.


ఇక జల్లికట్టు గురించి ఇతర వ్యవహారాల గురించి ఎంతోమంది జంతు ప్రేమికులు ఎన్నో రకాలుగా పోరాడుతున్నారు, ఆ సమయంలో ఆ ఎద్దులు భరించే వేదన ఎలా ఉంటుందో అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అలా జల్లికట్టు ఆడుతున్నారు కదా అని మీరు కూడా అలాగే చేస్తాను అనడంలో అర్థం ఏముంది? అంటూ రష్మీ కౌంటర్ వేసింది. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అనేది. 
Also Read: Veera Simha Reddy Collections: మూడో రోజు పుంజుకున్న 'వీర సింహా రెడ్డి'.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కొల్లగొట్టాలో తెలుసా?


Also Read: Waltair Veerayya Day 2: రెండో రోజు సగానికి సగం తగ్గిన కలెక్షన్స్.. అయినా ఎక్కడా తగ్గని వీరయ్య!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook