Udaya Bhanu New Home : యాంకర్ ఉదయభాను కొత్త ఇంటిని చూశారా?.. హోం టూర్ వీడియో వైరల్
Udaya Bhanu New Home తెలుగు టెలివిజన్ హిస్టరీలో ఉదయభానుకి సపరేట్గా ఓ చరిత్ర ఉంటుంది. ఇప్పుడంటే సుమ టాప్ ప్లేసులో ఉండి.. యాంకరింగ్ రంగాన్ని ఏలేస్తోంది. కానీ ఒకప్పుడు వన్స్ మోర్ ప్లీజ్, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, సాహసం చేయరా డింభకా అంటూ ఇలా లెక్కలేనన్ని షోలు చేసి మెప్పించింది.
Udaya Bhanu New Home తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఉదయభాను గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ప్రారంభం అయిన కొత్తలో యాంకర్‌గా ఉదయభాను ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో కూడా నటించినా ఉదయభానుకి ఎక్కువగా బుల్లితెర కార్యక్రమాల ద్వారా గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఉదయభాను అంటే యాంకరింగ్... యాంకరింగ్ అంటే ఉదయభాను అన్నట్లుగా పరిస్థితి ఉండేది. గత ఐదు.. పది సంవత్సరాలుగా సుమ యాంకరింగ్ లో ఏ స్థాయిలో దూసుకు పోతుందో, 20 సంవత్సరాల క్రితం ఉదయభాను అదే స్థాయిలో దూసుకు పోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఒకేసారి నాలుగైదు షోస్ చేయడంతో పాటు ఎన్నో ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ ఉండేది. ఆమె వ్యక్తిగత జీవితం విషయంలో ఆ మధ్య కొన్ని వివాదాలు గొడవలు జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆమె లైఫ్ చాలా ప్రశాంతంగా సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. అప్పుడప్పుడు టీవీల్లో కనిపిస్తుంది. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లలో కనిపిస్తుంది. ఈ మధ్య బాలయ్య ఈవెంట్లలో ఉదయభాను మెరుస్తోంది.
ఇక ఈ మధ్య కాలంలో ఆమె యూట్యూబ్ ద్వారా చాలా విషయాలను అభిమానులతో ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంది. తాజాగా ఉదయభాను తన కొత్త ఇంటి విశేషాలను తన యూట్యూబ్ ఫాలోవర్స్ తో పంచుకుంది. తన ఇద్దరు కూతుర్ల కోసం కొత్త ఇంటికి షిఫ్ట్ అయినట్లుగా ఉదయభాను పేర్కొంది. ఈ మధ్య కాలంలో తమ కూతుర్ల స్కూల్ కొత్త ప్లేస్ కి మారిందని.. ఆ కొత్త ప్లేస్ కి దగ్గర్లోనే ఒక కమ్యూనిటీ లో ఇల్లు తీసుకున్నామని దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు చూపించింది.
గృహప్రవేశం ఎలా చేసింది.. పాలు ఎలా పొంగించింది.. అనేది కూడా ఆ వీడియోలో చూపించింది. అంతే కాకుండా హాల్, పూజ గది, కిచెన్, బెడ్రూమ్స్ ఇలా అన్ని రూమ్స్ ని చూపిస్తూ వీడియోని చేసింది. గతంలో తాము హైటెక్ సిటీలో ఉండే వాళ్ళమని.. అక్కడ నుండి కొత్త ఇంటికి కూతుర్ల స్కూల్ కోసం మారుతున్నామని ఉదయభాను పేర్కొంది.
Also Read: Anchor Manjusha : అందమంతా మంజూష దగ్గరే ఉన్నట్టుందే.. ఆహా అనిపించేలా యాంకర్.. పిక్స్ వైరల్
ప్రస్తుతం ఉన్న ఇంటి నుండి స్కూలుకి గంటకు పైగా సమయం పడుతుందని.. ఉదయం సాయంత్రం కలిపి రెండు గంటలకు పైగా వారు ప్రయాణించాల్సి వస్తుందని అందుకే స్కూల్ కి దగ్గర్లో ఇలా ఇల్లు తీసుకున్నామని ప్రస్తుతం వర్క్ చివరి దశలో ఉందని త్వరలోనే పూర్తి వరకు అయిపోతుందని ఆ తర్వాత మళ్లీ ఇంటిని చూపిస్తానంటూ ఉదయభాను పేర్కొంది. ఉదయభాను ఇల్లు ఇంద్రభవనం మాదిరిగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Rajamouli : ఎంత ప్రయత్నించినా లోపలకు వెళ్లనివ్వలేదు.. నాటి ఘటనపై నోరువిప్పిన రాజమౌళి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook