Mobile Theatre: సినిమా ఇప్పుడు అత్యాధునికమైంది. ఒకప్పుడు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అన్నీ టూరింగ్ టాకీసులే. వీటికి మల్టీప్లెక్స్ హంగులు కల్పిస్తే..అదొక కొత్త ఆవిష్కారం. రాష్ట్రంలో తొలి మైబైల్ సినిమా ధియేటర్ రాజమండ్రి సమీపంలో సిద్ధమౌతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓల్డ్ ఈజ్ ఎవర్ గోల్డ్. నాటి టూరింగ్ టాకీసులకు కాస్త హంగులు, టెక్నాలజీ అద్దితే అదే మొబైల్ థియేటర్. ఆలోచన కొత్తది. ఆవిష్కారం కొత్తది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని రాజానగరంలో రాష్ట్రంలోనే తొలి మొబైల్ థియేటర్ ఏర్పాటుకానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..


ఒకప్పుడు పాత రోజుల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సినిమా ప్రదర్శనలన్నీ టూరింగ్ టాకీసుల్లో జరిగేవి. ఇప్పుడా కాన్సెప్ట్‌ను ఆధునీకరించారు. సినీ ప్రియుల్ని ఆకట్టుకునేందుకు సరికొత్త హంగులతో, టెక్నాలజీతో , సౌకర్యాలతో రాష్ట్రంలోనే తొలి మొబైల్ థియేటర్ రూపుదిద్దుకుంటోంది. రాజానగరం జీఎస్ఎల్ మెడికల్ కళాశాల చేరువలో ఉన్న హ్యాబిటెట్ ఫుడ్ కోర్ట్‌లో ఇది ఏర్పాటు కానుంది. ఢిల్లీకు చెందిన పిక్చర్ డిజిటల్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. 


ఎలా ఉంటుంది


గాలి నింపే బెలూన్ల వంటి షీట్లతో టెంట్ ఏర్పాటవుతుంది. ఈ టెంట్ థియేటర్ మాదిరి ఉంటుంది. వాతావరణ పరిస్థితులు, అగ్ని ప్రమాదాల్ని తట్టుకునే టెక్నాలజీతో ఈ నిర్మాణముంటుంది. 120 సీట్ల సామర్ద్యం ఉంటుంది. బయట్నించి చూస్తే..ఓ సెట్టింగ్‌లా ఉంటుంది. ఎక్కడికైనా సులభంగా తరలించేందుకు వీలుగా ప్లాస్టిక్, స్పాంజ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నెల 23న థియేటర్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ నెల 29న విడుదల కానున్న ఆచార్య సినిమా తొలి సినిమా అవుతుందని తెలుస్తోంది. 


Also read: F3 Movie: ఎఫ్‌ 3 స్పెష‌ల్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్.. హాట్ సమ్మర్‌లో కూల్ అందాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook