Movie Tickets: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇకపై సినిమా టిక్కెట్లన్నీ ఆన్‌లైన్ ద్వారానే విక్రయించనున్నారు. అన్ని థియేటర్ టిక్కెట్ల అమ్మకాలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ధియేటర్లు, సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం(Ap government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్ రూపొందనుంది. రైల్వే టికెట్ల బుకింగ్ తరహాలో ఈ పోర్టల్ ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. సినిమా టికెట్ల విక్రయ విధాన్ని అధ్యయనం చేసిన తరువాత ఆన్‌లైన్ బుకింగ్ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


రాష్ట్రంలోని సింగిల్ థియేటర్స్, మల్టీఫ్లెక్స్‌లలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం పోర్టల్(Movie Ticket Booking Portal)రానుంది. ఈ ఆన్‌లైన్ సినిమా టికెటింగ్ సిస్టమ్‌ను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షించనుంది. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్, అభివద్ధి, అమలు ప్రక్రియ కోసం ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కో ఛైర్మన్‌గా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరిస్తున్నారు. ఏపీ ఎఫ్ టీడీసీ సెక్రటరీ, కమర్షియల్ టాక్స్ రిప్రంజెంటేటివ్ ఆఫ్ కమీషనర్, ఏపీటీఎస్ ఎండీ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్, గుంటూరు జిల్లా జాయంట్ కలెక్టర్, ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు.


Also read: Uttar Pradesh: హాట్ హాట్‌గా యూపీ రాజకీయాలు, ప్రచారం ప్రారంభించేసిన ఒవైసీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook